Madhu Yaskhi: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. హింట్ ఇచ్చేసిన బండి సంజయ్! బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందంటూ కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. విలీనంలో భాగంగానే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారని ఆరోపించారు. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ బండి సంజ్ హింట్ ఇచ్చారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 15 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: బీఆర్ఎస్ (BRS) త్వరలోనే బీజేపీలో (BJP) విలీనం కాబోతుందంటూ మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు ఒప్పదం కుదుర్చుకునేందుకే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపారంటూ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న మధుయాష్కి.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కిషన్ రెడ్డి వ్యతిరేకిస్తే బండి సంజయ్ మద్దతు పలికారన్నారు. అందుకే బండి సంజయ్ (Bandi Sanjay).. హరీష్ రావును మంచి లీడర్ అంటూ పొగుడుతూ హింట్ ఇచ్చేరంటూ ఆసక్తికర ఆరోపణలు చేశారు. ఆ ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీ ఇవ్వట్లేదు.. అలాగే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుంటే కేసీఆర్ మద్దతు పలికారంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీలు ఇవ్వడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా పాలనను చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని స్పష్టం చేశారు. Also Read: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి #brs #bjp #bandi-sanjay #harish-rao #madhu-yashki మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి