బంగాళా ఖాతంలో అల్పపీడం.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్!! ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. By E. Chinni 17 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లని కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). రేపటి నుంచి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య బంగాళా ఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళా ఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంది. దీని ప్రభావంతో రేపటికి ఉత్తర బంగాళా ఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడనం ఏర్పడిన తర్వాత ఏపీలో చాలా జిల్లాల్లో మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ప్రస్తుతం బంగాళా ఖాతంలో పరిస్థితులు అల్ప పీడనం ఏర్పడేందుకు అనుకూలంగా మారాయని.. దీంతో రాగల వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు.. కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తోందని.. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయని చెప్పారు. ఈనెల 18, 19 తేదీల్లో భారీ వర్ష సూచన కూడా ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం అయినప్పటికీ వర్షాలు సరిగ్గా కురవడం లేదు. కాగా ఒకపైపు రుతుపవన ద్రోణ భారతదేశం వైపు ఉంది. మరోవైపు రుతుపవనాలు బలహీనంగా మారాయి. వాస్తవానికి వర్షా కాలంలో మేఘాలు దట్టంగా కమ్ముకోవడం వల్ల ఉష్ణోగ్రతలో తగ్గి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఏపీలో మాత్రం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో నిర్మలంగా మారింది. దీంతో సూర్యుని కిరణాలు నేరుగా భూమి పైకి పడుతున్నాయి. ఆ కారణంగా ఆగస్టు మొదటి పక్షంలో ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత పెరిగింది. చాలా చోట్ల ఈ సీజన్లో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. అయితే నెల్లూరు జిల్లాలో.. ఉష్ణోగ్రతలు కొనసాగి క్రమంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. గత వారం రోజులుగా ఏపీలో 38 డిగ్రీల వరకు చాలాచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నుంచి క్రమంగా ఉష్టోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. #andhra-pradesh #rains #heavy-rains #bay-of-bengal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి