Viral: గొప్ప గొప్ప పండితులు కూడా ఈ ఆంగ్ల పదాన్ని ఉచ్చరించలేకపోయారు.. మరి మీకు చదివే దమ్ముందా? ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం కలిగిన ఎంతో మంది ఈ భూప్రపంచంలో ఉన్నారు. కానీ, ఎంత గొప్ప పండితులైనప్పటికీ.. ఈ ఇంగ్లీష్ పదాన్ని మాత్రం ఉచ్చరించలేకపోతున్నారు. దానిని చదివేందుకు తత్తరపాటుకు గురవుతున్నారు. ఆ పదం ఏంటో ఓసారి లుక్కేయండి. By Shiva.K 16 Sep 2023 in ట్రెండింగ్ వైరల్ New Update షేర్ చేయండి Longest English Word: ఎదుటి వారితో కమ్యునికేట్ చేయడానికి, ఇతర అనేక అంశాలకు భాష(Language) అనేది చాలా కీలకం. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్(English) లాంగ్వేజ్ చాలా ముఖ్యం అని చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో కలిసినప్పుడు.. కామ్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్‌లోనే సంభాషిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న ఆంగ్లం.. అంతర్జాతీయ దౌత్యం, వాణిజ్యం, కమ్యూనికేషన్ కోసం ప్రాథమిక భాషగా నిలిచింది. అయితే, ప్రతి భాషలోనూ కొందరు నిష్టాతులు ఉంటారు. వారికి ఆయా భాషలు కొట్టిన పిండితో సమానం. ఏ పదమైనా ఇట్టే పలకడం, దాని అర్థాన్ని వివరించడం చేస్తారు. అయినప్పటికీ కొన్ని పదాలు పండితులను సైతం గందరగోళానికి గురి చేస్తుంది. వాటి ఉచ్ఛారణ ఎలాగో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ కఠినమైన ఆంగ్ల పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని ఉచ్ఛరించేందుకు భాషా పండితులు సైతం తడబాటుకు గురవుతున్నారు. మరి ఆ పదం ఏంటి? దానిని ఎలా పలకాలి? దాని అర్థం ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గొప్ప పండితులు కూడా దీనిని ఉచ్చరించలేరు.. ఇవాళ మనం ఓ కఠినమైన ఆంగ్ల పదం గురించి తెలుసుకుందాం. ఈ పదంలో 45 అక్షరాలు ఉంటాయి. ఇది చాలా కష్టమైన పదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆ పదం 'Pneumonoultramicroscopicsilicovolcanoconiosis'(న్యుమోనోఅల్ట్రామైక్రోస్కోపిక్సిలికోవోల్కనోకోనియోసిస్). గూగుల్ దీనిని Pneumonoultramicroscopicsilicovolcanoconiosis అని చదువుతుంది. ఇది వ్యాధికి సంబంధించిన పేరు. ఊపిరితిత్తుల వ్యాధి. ధూళిని పీల్చడం వల్ల ఇది వస్తుంది. మీరు ఈ పదాన్ని చదవగలరా? ఒకసారి ప్రయత్నించండి. దీనిని ఆంగ్ల నిఘంటువులో అత్యధిక అక్షరాలు ఉన్న పదంగా పేర్కొంటారు. మీకు చదవడ రాకపోతే.. ఈ పదాన్ని సులభతరం చేయడానికి.. చిన్న చిన్న పదాలుగా వేరు చేస్తున్నాం. ఓసారి చదవండి. 'న్యూమెనో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వోల్కనో కోనియోసిస్' అదన్నమాట ఈ పదం కహానీ. ఈ పదాన్ని ఇప్పటి వరకు నిఘంటువులో చేర్చలేదు.. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద పదం ఒకటుందట. దానిని ఇప్పటి వరకు డిక్షనరీలో పేర్కొనలేదు. వాస్తవానికి దాని అర్థం చిన్నదే అయినా.. పదం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మానవులలో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్. ఈ పదం 'Methionylalanylthreonylserylarginylglycyl'తో మొదలై లక్షా తొంభై వేల అక్షరాల వరకు ఉంటుంది. ఈ పదం చాలా పెద్దది. ఈ ఒక్క పదానికి మొత్తం డిక్షనరీ పేజీలు పడుతుంది. అందుకే ఈ పదాన్ని ఇప్పటి వరకు నిఘంటువులో చేర్చలేదు. ఈ పదాన్ని క్లుప్తంగా చూస్తే.. దాని అర్థం టిటిన్. ఇది ఒక ప్రోటీన్ అని అర్థం. Also Read: ORR పై టెన్షన్..టెన్షన్..ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీకి నో పర్మిషన్..!! Chandrababu Arrest: సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం.. నారా లోకేష్ సంచలన కామెంట్స్.. #viral-news #trending-news #longest-english-word #scholars #english-pronounce #special-word మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి