Telangana Game Changer : నిజామాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లో కాంగ్రెస్ నుంచి టి.జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : నిజామాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

Lok Sabha Elections 2024 : నిజామాబాద్‌(Nizamabad). మహారాష్ట్ర(Maharashtra) కల్చర్‌తోపాటు తెలంగాణ(Telangana), ఆంధ్ర(Andhra Pradesh) సాంస్కృతిక నేపథ్యం కలిగిన నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో విశేషాలెన్నో వున్నాయి. బోధన్‌ సుగర్‌ ఫ్యాక్టరీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టుపై ఆధారపడే పాడి పంటలు ఇక్కడ ప్రత్యేకతలు.. లోక్‌సభ(Lok Sabha) సీటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాలలో ఆంధ్రా సెటిలర్ల తీర్పే ఇక్కడ కీలకం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 5 నియోజకవర్గాలు నిజామాబాద్‌ జిల్లా నుంచి, రెండు సెగ్మెంట్లు కరీంనగర్‌ జిల్లా నుంచి తీసుకుని కొత్త రూపును సంతరించుకుంది నిజామాబాద్‌ లోక్‌సభ సీటు.


2019లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు.

publive-image

Also Read : తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష

కాంగ్రెస్ అభ్యర్థి
టి.జీవన్ రెడ్డి - టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చి, చాలా కాలంగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేత. మంత్రిగా చేశారు.

బీజేపీ అభ్యర్థి
ధర్మపురి అరవింద్ - సిట్టింగ్ ఎంపీ. మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ రాజకీయ వారసుడు.

బీఆర్ఎస్ అభ్యర్థి
బాజిరెడ్డి గోవర్ధన్ - మాజీ ఎమ్మెల్యే. మాజీ ఆర్టీసీ చైర్మన్. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు.

గెలుపు అవకాశాలు: బీజేపీ

publive-image

రీజన్స్‌:
1) పసుపుబోర్డు సాధించడం అరవింద్‌కు సానుకూలంశం. చాలా మంది పసుపు రైతులు అరవింద్‌ వెంట స్వచ్చందంగా ప్రచారం చేస్తుండడం కలిసి వచ్చే అంశం.
2) హిందూ ఓట్లు పోలరైజ్‌ అయ్యే నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌ ఏరియాల్లో అరవింద్‌ కరిష్మా బాగా పెరిగింది.
3) సంఘ్‌ పరివార్‌ సంస్థలు బలంగా వుండడం బీజేపీకి సానుకూలాంశం.
4) నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌లలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌ వైపు మళ్ళుతాయి.
5) కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌ రెడ్డి జగిత్యాల, కోరుట్ల ప్రాంతాలకే సుపరిచితుడు. ఈరెండింటిలో బీఆర్‌ఎస్‌ గెలిచింది. వెలమలిక్కడ ప్రభావం చూపుతారు. వారిపుడు రేవంత్‌ రెడ్డి తమపై పగబట్టాడన్న కోపంతో ఉన్నారు. వీరు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు