CM Revanth Reddy : రెండో రాజధానిగా వరంగల్ : రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ కు రాష్ట్ర రెండో రాజధాని అయ్యే అర్హత ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రేవంత్. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి పార్టీలను ఓడించాలన్నారు.

New Update
CM Revanth Reddy : రైతు బంధు‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Warangal : వరంగల్ కు రాష్ట్ర రెండో రాజధాని అయ్యే అర్హత ఉందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన పార్టీ ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్(KCR) ను వేర్వేరుగా చూడొద్దని ప్రజలను కోరారు. ఆ ఇద్దరు కలిసి తెలంగాణ(Telangana) కు అన్యాయం చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో కేసీఆర్ కు గుణపాఠం చెప్పామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మోదీ గతంలో ఇచ్చిన 20 కోట్ల ఉద్యోగాల హామీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: TS Politics: కోమటిరెడ్డి సీఎం.. ఉత్తమ్ సంచలన కామెంట్స్

వ్యవసాయాన్ని నల్లచట్టాలతో రైతుల ప్రాణాలను అదానీ దగ్గర మోదీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదన్నారు. కానీ కేసీఆర్ లక్షల కోట్లు కట్టి నిర్మించిన కేసీఆర్ ప్రాజెక్టులు అప్పుడే ఆగమయ్యాయన్నారు.  కడియం శ్రీహరి నిజాయితీని చూసి పార్టీలో చేర్చుకున్నామన్నారు. ఈ ప్రాంతం నుంచి మరొక ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు రేవంత్. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని హెచ్చరించారు రేవంత్.

నిజాయితీని వారసత్వంగా తీసుకుని మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానన్న హరీష్ రావు కామెంట్స్ పై కూడా స్పందించారు రేవంత్ రెడ్డి. హరీశ్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు అంటూ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి హరీశ్ సంగతి తెలుస్తానన్నారు. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టె దొరకలేదని చెప్పినట్లు కాదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫుల్ స్పీచ్ ను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు