వరంగల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. కావ్య ముందే కొట్టుకున్న నేతలు! వరంగల్ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వివాదాలు ఇంకా ఆగలేదు. ఈ రోజు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ముందే కార్యకర్తలు మరోసారి కొట్టుకున్నారు. ఎంత వారించినా వినకపోవడంతో కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. By Nikhil 01 May 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Congress Leaders Fight in Warangal: వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఈ రోజు నిర్వహించిన పార్టీ సమావేశం గందరగోళంగా మారింది. కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వారికి, పాత వారికి మధ్య వివాదం చోటు చేసుకుంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని పాత నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) ముందే కార్యకర్తలు కొట్టుకున్నారు. గొడవ వద్దని ఆమె వారించినా కార్యకర్తలు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీలేక కావ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. పార్టీలో వివాదాలు ఇంకా ఆగకపోవడంతో అగ్రనేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. పాత, కొత్త నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం నాయకత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనే అంశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది. Also Read: నన్ను బెదిరిస్తారా?.. మోడీకి సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ #congress #lok-sabha-elections-2024 #warangal #kadiyam-kavya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి