Parliament Sessions : నేడు పార్లమెంటులో రామమందిర నిర్మాణంపై తీర్మానం.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ రామ మందిర నిర్మాణం అలాగే రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. By B Aravind 10 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Parliament Discussion About Ram Mandir : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అయోధ్య(Ayodhya) లో ప్రధాని మోదీ(PM Modi) చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకంగా.. జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు రామమందిరాన్ని సందర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Sessions) జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు.. ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. Also Read : సీఎం రేవంత్‌ను కలవనున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఎందుకంటే Budget Session | Rajya Sabha will later commence a short-duration discussion on 'Shree Ram Mandir Ke Etihasic Nirman aur Pran Pratishta' (Historic construction of Shree Ram Temple and Pran Pratishta). BJP MPs Sudhanshu Trivedi and Rakesh Sinha are to raise the discussion on the… — ANI (@ANI) February 10, 2024 అనంతరం రామమందిర(Ram Mandir) నిర్మాణంపై లోక్‌సభ(Lok Sabha) లో చర్చ జరగనుంది. బీజేపీ(BJP) సీనియర్ నేత సత్యపాల్ సింగ్(Satyapal Singh) రామ మందిర నిర్మాణం అలాగే రామ్‌లల్లా(Ram Lalla) ప్రాణప్రతిష్ఠపై చర్చను ప్రారంభిస్తారని లోక్‌సభ సచివాలయం తెలిపింది. ఈ విషయంపై చర్చను కోరుతూ శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే కూడా నోటీసు ఇచ్చారు. అయితే ఈ చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు..రామ మందిర నిర్మాణాన్ని సాకారం చేశారంటూ ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తనున్నట్లు తెలుస్తోంది. అయితే నేటితో (శనివారం) పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమైన సభా వ్యవహారాల నేపథ్యంలో పార్టీకి చెందిన పార్లమెంటు ఉభయ సభల సభ్యులు చివరి రోజు జరిగే సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలంటూ బీజేపీ విప్ ఆదేశించింది. Also Read: జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్ #telugu-news #national-news #ayodhya-ram-mandir #parliament-budget-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి