RS Praveen Kumar: కాంగ్రెస్ అప్పులపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఆర్‌ఎస్ ప్రవీణ్. ఈ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని.. దీనిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

New Update
RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!

RS Praveen Kumar: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ. 6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రేసు ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ. 16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని అన్నారు. ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. వాటిని బడ్జెట్లలో చూపించరని అన్నారు. అప్పుడు కనీసం మౌళిక సదుపాయాలైనా వచ్చాయని, ఇప్పుడు వాటి ఊసే లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తుందని మండిపడ్డారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ లో కీలక పదవి..

బీఎస్పీ(BSP) కి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌(Ex IPS RS Praveen Kumar) బీఆర్‌ఎస్‌(BRS) కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఆయనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించారు. ఆపద సమయంలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడాన్ని మర్చిపోనని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న నేతల గురించి పట్టించుకోవద్దని తెలిపారు. 

ఎంపీ టికెట్ పక్క..

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి చెందారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తాజాగా బీఆర్ఎస్ లో చేరారు. ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్  కు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు