Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ  బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా?

బ్యాంకులు వివిధ రకాల కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ ఇస్తాయి. వివిధ బ్యాంకులు ప్రాపర్టీ లోన్స్ పై ఎంత వడ్డీ విధిస్తాయో.. నెలకు ఈఎంఐ ఎంత కట్టాల్సి వస్తుందో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

New Update
Loan on Properties: ప్రాపర్టీ లోన్ పై ఏ  బ్యాంకులో ఎంత వడ్డీ ఉంటుందో తెలుసా?

Loan on Properties: ఇంటి మీదే కాకుండా.. ఆస్తులపై కూడా అంటే ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ మన బ్యాంకులు ఇస్తాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ పై కూడా లోన్స్ దొరుకుతాయి. ఈ లోన్స్ పై సాధారణంగా 9.5 శాతం వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ప్రాపర్టీ లోన్స్ పై తక్కువ వడ్డీకి దొరికే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా, ప్రాపర్టీ పై లోన్ వడ్డీని నిర్ణయించడంలో ఆ ప్రాపర్టీ స్థితి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 

Bankbazaar.com డేటా ప్రకారం, ఇక్కడ పేర్కొన్న బ్యాంకులు 11.40 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలానికి రూ. 15 లక్షల విలువ ఉన్న ప్రాపర్టీ పై లోన్స్(Loan on Properties) ఇస్తున్నాయి.

HDFC బ్యాంక్
ప్రాపర్టీ లోన్  కోసం HDFC బ్యాంక్ వడ్డీ రేట్లు 9.50 శాతం నుండి ప్రారంభమవుతాయి. 7 సంవత్సరాల కాలవ్యవధికి ఆస్తిపై రూ.15 లక్షల రుణానికి EMI సుమారు రూ.24,323గా ఉంటుంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .. ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు 10.10 శాతం నుండి ప్రారంభమవుతాయి. 7 సంవత్సరాల కాలవ్యవధికి ఆస్తిపై రూ. 15 లక్షల రుణం కోసం EMI దాదాపు రూ. 24,771 చెల్లించాల్సి ఉంటుంది. 

యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) 10.50 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో ప్రాపర్టీపై లోన్ ఇస్తుంది. 7 సంవత్సరాల కాలవ్యవధితో రూ.15 లక్షల రుణానికి ఈఎంఐ రూ.25,072 అవుతుంది.

Also Read: మీరు ఐఫోన్‌లో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభ వడ్డీ రేటు 10.55 శాతం. 7 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 15 లక్షల ప్రాపర్టీ లోన్‌పై EMI రూ. 25,109 అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఆస్తిపై రుణం కోసం రేట్లు 10.85 శాతం నుండి ప్రారంభమవుతాయి. 7 సంవత్సరాల కాలవ్యవధితో రూ.15 లక్షల రుణంపై ఈఎంఐ రూ.25,336 అవుతుంది.

కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ 11.05 శాతం ప్రారంభ రేటుతో వడ్డీని అందిస్తోంది. 7 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 15 లక్షల రుణానికి EMI రూ. 25,488 చెల్లించాల్సి వస్తుంది. 

ICICI బ్యాంక్ .. బ్యాంక్ ఆఫ్ ఇండియా
ICICI బ్యాంక్ .. బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు 11.35 శాతం నుండి ప్రారంభమవుతాయి. 7 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 15 లక్షల రుణానికి EMI రూ. 25,717గా ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 11.40 శాతం ప్రారంభ రేట్ల వద్ద రుణాలను అందిస్తుంది. 7 సంవత్సరాల కాలవ్యవధితో రూ.15 లక్షల రుణంపై ఈఎంఐ రూ.25,756 అవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment