West Bengal: మా గవర్నర్ జేమ్స్ బాండ్! మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. By Bhavana 05 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే..బెంగాల్ గవర్నర్ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని భావించిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వంలో కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు(Bratya basu) గవర్నర్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి అంటే..మా రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మా రాష్ట్రానికి, మా విద్యాశాఖ పరిధిలో ఉన్న యూనివర్సిటీలకు జేమ్స్ బాండ్ లా వ్యవహరిస్తున్నారు. అందుకే ఆయన అర్థం పర్థం లేని నిర్ణయాలను అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రానికి గవర్నర్ గా చేసిన ప్రస్తుత ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ ఖర్(Jagadeep Dhanakhar) ఏనాడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రస్తుత గవర్నర్ ఛాన్సలర్ హోదాలో ఎనిమిది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించారు. ఆ నిర్ణయం విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు కు నచ్చలేదు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు. కానీ గవర్నర్ ఆయన అనుకున్న పనినే చేశారు. దీంతో మంత్రిగారు మా గవర్నర్ జేమ్స్ బాండ్ అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ప్రెసిడెన్సీ యూనివర్సిటీతో పాటుగా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్, నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ, వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సైస్ యూనివర్సిటీలకు గవర్నర్ వైస్ ఛాన్సలర్లను నియమించారు. గతంలో గవర్నర్ గా చేసిన జగదీప్ ఏదైనా విషయం ఉంటే విద్యాశాఖ తో సంప్రదింపులు జరిపిన తరువాతే..ఫైళ్లను ముందుకు కదిల్చేవారు. అంతే తప్పా ఇలా ఏకపాత్రాభినయం చేయలేదంటూ విమర్శించారు. గవర్నర్ సీవీ ఆనందబోస్ ఏకపక్షంగా వ్యవహరించి తాత్కాలిక ఛాన్స్‌లర్లను నియమించడంతో ముఖ్యమంత్రి స్థాయి నుంచి విమర్శలు మొదలయ్యాయి.ఎటువంటి విద్యా నేపథ్యం లేని వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ నియామకాలపై ఘాటుగా విమర్శించారు. #politics #minister #west-bengal #mamata-benarjee #governer #jamesbond మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి