/rtv/media/media_files/2025/04/11/bO29DZTAnEVs548r087X.jpg)
IVF with AI: తాను తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని రుజువు చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రానున్న రోజుల్లో ఏఐదే హవా అంటే ఎవరూ నమ్మలే. కానీ వాటిని నిజం చేసి చూపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు మెడిసిన్, ఇంజనీరింగ్, రక్షణ, అగ్రికల్చర్ లాంటి అన్నీ రంగాల్లో ఏఐ అడుగుపెట్టేస్తోంది. అందులో తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం. కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ ఓ సంచలనం సృష్టించారు. కృత్రిమ గర్భధారణలో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంతో 40 ఏండ్ల మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
Also Read: Tesla Cybertruck: టెస్లా సర్‌ప్రైజ్: కేవలం $69,990కి కొత్త సైబర్‌ట్రక్ విడుదల!
A 40-year-old woman in Mexico has given birth to the world’s first baby conceived through an AI-powered IVF procedure.
— Pop Base (@PopBase) April 10, 2025
This is the first time an AI system has performed all 23 steps of the ICSI procedure — including sperm selection and injection — without human hands. pic.twitter.com/nwJ4gZPnab
Also Read: Egg prices: కోడిగుడ్డుకు రెక్కలు.. కోళ్లను అద్దెకు తెచ్చకుంటున్న అమెరికన్స్
వైద్య చరిత్రలోనే ఓ మెరాకిల్
శుక్ర కణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేయటమన్నది (ఐసీఎస్‌ఐ) ఐవీఎఫ్‌లో సర్వసాధారణమైన ప్రక్రియ. నిపుణులైన (ఎంబ్రాయలజిస్ట్) వారితో ఐసీఎస్‌ఐను చేపడతారు. ఇది 23 దశల్లో జరుగుతుంది. అయితే ఈ మొత్తం స్టేజ్‌ల్లో మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో వైద్య బృందం పూర్తి చేయటం వైద్య చరిత్రలోనే ఓ మెరాకిల్. వైద్యులు తయారుచేసిన నూతన పద్ధతిలో పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంలో సంతానోత్పత్తి ప్రపంచంలోనే తొలిసారి. దీంతో 1990 నుంచి వైద్యులు ఉపయోగిస్తున్న ఐసీఎస్‌ఐ సాధారణ ప్రక్రియకు నూతన పద్ధతి ప్రత్యామ్నాయంగా మారనున్నది. శుక్ర కణాల ఎంపిక, అండంలోకి ఇంజెక్ట్ చేయటం, ఫలదీకరణం సహా అనేక ప్రక్రియలను ఏఐ సాయంతో ఆటోమేటెడ్ పద్ధతిలో పూర్తిచేయటం కొత్త పద్ధతిలో భాగం. ఈ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వస్తే IVF సేవల ఫీజులు భారీగా తగ్గనున్నాయి. అంతేకాదు.. ఆ రంగంలో డాక్టర్ల కొరతను ఏఐ భర్తీ చేయనుంది.
Also Read: వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ధర వెరీ చీప్- ఫీచర్స్ కిర్రాక్!