/rtv/media/media_files/2025/01/08/XtAvpF5CchLOBMiST83K.jpg)
sankrati
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతిని మూడురోజుల పాటు చాలా ఘనంగా చేసుకుంటారు. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కూడా ఈ పండుగకు సొంతూర్లకు చేరుకుంటుంటారు.ఈ మూడు రోజులు పల్లెటూర్లన్నీ పండగ వాతావరణంతో కళకళలాడుతుంటాయి. .
Also Read: Cinema: బాక్సాఫీసు కొల్లగొడుతున్న డాకూ మహరాజ్..3 రోజుల్లో 50 కోట్లు
సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే చాలామంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయల్దేరేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు. కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు మరుసటి రోజు బయల్దేరండి అని మన పెద్దలు అనడం చాలా సందర్భాల్లో వినే వింటాం. కనుమ రోజు చెట్టుమీద ఉన్న కాకులు కూడా కదలవు అనే సామెతను కూడా ఉదాహరణకు చెబుతుంటారు పెద్దలు. అయితే కనుమ రోజున అసలు ప్రయాణం ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కనుమ అంటే పశువుల పండుగ. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవిచేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకునే రోజుగా కనుమని పాటిస్తారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాల్లో వీటి పాత్ర ఎంతో ఉంది.
Also Read: క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..
వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను జరుపుకుంటారు. కనుమ రోజున ప్రయాణాలు చేయోద్దని చెప్పడం వెనుకాల అనేక కథనాలు ఇప్పటికి ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే..గతంలో ఎక్కడికి వెళ్లాలన్న బండ్లే దిక్కుగా ఉండేవి. కనుమ రోజు ఎద్దులను అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజించేవారు. దీంతో పాటు ఆరోజున వాటికి ఇష్టమైన మేత పెట్టి వాటికి విశ్రాంతి ఇచ్చారు. ఆ ఒక్కరోజైనా కష్టపెట్టకుండా ఉంచాలనే గొప్ప భావనతో ఎడ్ల బండ్లు కట్టకుండా చూసేందుకే కనుమ రోజు ప్రయాణం వద్దని మన పెద్దలు అనేవారు.
నోరులేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండగని అనుకుంటారు. ఇది కూడా మరో కారణం బాగా ప్రాచుర్యంలో ఉన్న మరో కథ ఏంటంటే కనుమ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకు వస్తారని అంటుంటారు. అందుకే చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకుంటూ పిండి వంటలు చేసుకు తింటారు . దీని వల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. వారికి ఇష్టమైన పిండి పదార్థాలు, మద్యం మొదలైనవి చేసి పెట్టి వారి ప్రసాదంగా ఇంట్లో వాళ్లు తింటారు.
కనుమ రోజున ఇంట్లోని వారందరూ కలిసి అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ పండుగని వేడుకగా జరుపుకుంటారు. ఉదయాన్నే పశువులను పూజించి, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి, సుష్టుగా భోజనం చేయడం చేస్తారు. ఈ సందర్భంగా మన శరీరం అనేది కొంత బద్ధకంగా ఉంటుంది. దీని వల్ల ప్రయాణం చేయడం కష్టమవుతుంది. కాబట్టి ప్రయాాణాలు చేయవద్దని అంటారు.
కనుమ రోజు ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి తినాలని నియమం కూడా ఉంది. కాబట్టి ఆ రోజు ఆగి పెద్దలను తలచుకోవాలనీ బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున ప్రయాణించాలని చెబుతుంటారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదని,లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటుంటారు.
Also Read: Musk: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా!
Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే