/rtv/media/media_files/2025/01/25/FdmFvo6RcS3YXpXWI0jJ.jpg)
Benefits Of Waking Up Early
ఆధ్యాత్మికంగా పాజిటివ్..
పొద్దునే లేస్తే ప్రపంచం పూర్తిగా ప్రశాంతంగా అని పిస్తుంది. ఎక్కడా శబ్దం, అడ్డంకులు ఉండవు. దేవునితో కనెక్ట్ కావాలనుకుంటే ఇది ఉత్తమ సమయం. ఉదయం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా పాజిటివ్‌గా ఉంటుంది. మెదడు సరిగా ఆలోచించ లేకపోతే, తెల్లవారుజామున 3, 5 గంటల మధ్య మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. ఈ సమయంలో మేల్కొనడం మిమ్మల్ని సృజనాత్మకంగా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈ మసాలా దినుసులు పేగులను శుభ్రం చేస్తాయి
గందరగోళం లేకుండా విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనస్సును అనుమతిస్తుంది. నిర్ణయాలు తీసుకోలేక పోతే ఈ సమయంలో మేల్కొనడం ప్రయోజనకరంగా ఉంటుంది. చదువు, ఏదైనా విషయాలను గుర్తుంచు కోవాలనుకుంటే ఉదయం 5 గంటలలోపు నిద్ర లేవాలి. ఈ సమయంలో విషయాలను బాగా గుర్తుంచుకుంటారు. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య నిద్ర లేవగానే మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. భావోద్వేగాలను బాగా నియంత్రించ గలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియుడిపై మోజు.. కట్టుకున్న వాడినే కడతేర్చిన కసాయి భార్య
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ టైమ్స్‌లో వర్కౌట్స్ చేశారంటే వర్కౌట్ కాదు