Ugadi 2025: నేడే ఉగాది.. ఈ రోజు ఇలా చేస్తే మీకు ఏడాదంతా శుభమే!

ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహుర్తంలోనే లేచి తలస్నానం ఆచరించాలని పండితులు అంటున్నారు. అలాగే కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని తినాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలని పండితులు చెబుతున్నారు.

New Update
Ugadi Festival

Ugadi Festival

వసంత కాలంలో వచ్చే ఉగాదిని యుగాది అని అంటారు. ఉగాది అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. అయితే హిందూ ప్రజలు నేడు ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ సారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఉగాది పండుగ రోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. చాలా మంది ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఇలా కాకుండా బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేచి తలస్నానం చేయాలి.

ఇది కూడా చూడండి:  Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!

కుటుంబ సభ్యులతో కలిసి..

కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని తయారు చేసి నైవేద్యంగా పెట్టాలి. ఆ పచ్చడిని తినాలి. కొత్త దుస్తులు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలి. సృష్టికి ఈ రోజే ఆరంభం కాబట్టి కొత్త పనులు చేపట్టవచ్చు. ఇంద్రధ్వజ, బ్రహ్మ ధ్వజ, రాజదర్శనం వంటి పూజలు నిర్వహిస్తే శుభం జరుగుతంది. అలాగే బంగారం, వెండి వస్తువులు కూడా కొనవచ్చని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

దీంతో పాటు ఉగాది పండుగ రోజు తప్పకుండా ఆలయానికి వెళ్లాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్య భగవానుని ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి. మీకు సమీపంలో సూర్య భగవానుని ఆలయం లేకపోతే వేరే ఇతర ఆలయానికి అయినా వెళ్లవచ్చు. అలాగే ఈ రోజు సూర్యాష్టకాన్ని చదివితే అన్ని విధాలుగా కలసి వస్తుందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు