/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/packeged-fruit-juices.jpg)
juices
వేసవిలో చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా ఉండాలంటే తప్పకుండా జ్యూస్‌లు తాగాల్సిందే. కేవలం పండ్ల రసాలే కాకుండా కూరగాయల జ్యూస్‌లు కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వేటితో జ్యూ్స్‌లు తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Nitin Gadkari: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
అల్లం
అల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
క్యారెట్
జ్యూస్ డైలీ క్యారెట్ జ్యూస్‌ను చేసి తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. వీటిలో పోషకాలు, విటమిన్లు చర్మాన్ని మెరిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీరు తయారు చేసుకునే జ్యూస్‌లో క్యారెట్ వేసి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్ సంచలనం!
బీట్‌రూట్
బీట్‌రూట్ చర్మాన్ని మెరిపిస్తుంది. నల్లగా ఉన్నవారు డైలీ ఈ జ్యూస్ తాగితే తప్పకుండా తెల్లగా అవుతారు. ఈ జ్యూస్ తాగడం వల్ల ముఖం మెరుస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరిపిస్తాయి.
ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
నిమ్మకాయ
వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డైలీ నిమ్మరసాన్ని మీరు జ్యూస్‌లో యాడ్ చేసుకోవడం లేదా నిమ్మరసాన్ని డైరెక్ట్‌గా తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. ముఖంపై ఉండే మొటిమలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఈజీగా బరువు కూడా తగ్గుతారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.