/rtv/media/media_files/2025/03/07/whhKjMZ6Bg5KmE0JNljf.jpg)
summer
వేసవి కాలం వచ్చేసింది. తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలంలో పోషకాలు ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి. లేకపోతే బాడీ డీ హైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగిపడిపోయిన ఆశ్చర్య పడక్కర్లేదు. అయితే వేసవిలో తినకూడని ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
డ్రై ఫూట్స్
జీడిపప్పు, పిస్తా వంటి వాటిని ఎక్కువగా తినవద్దు. వీటివల్ల బాడీ వేడి చేస్తుంది. సాధారణంగానే వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఇంకా ఎక్కువ శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
స్పైసీ ఫుడ్
వేసవిలో స్పైసీ ఫుడ్‌ను తినడం తగ్గించాలి. వీటిని తినడం వల్ల బాడీ డీహైడ్రేట్ కావడంతో పాటు ఎండ తీవ్రతకి చిరాకు అనిపిస్తుంది. కాస్త తక్కువ స్పైసీ ఉండే వాటిని తీసుకోండి.
వేయించిన పదార్ధాలు
వేసవిలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరానికి ఎలాంటి శక్తి అందదు. దీంతో బయటకు వెళ్లినప్పుడు కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
కాఫీ
కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే కాఫీని ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవద్దు. కాఫీ ఎక్కువగా తాగితే బాడీకి వేడి చేస్తుంది. ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు.. కానీ రోజులో ఎక్కువ సార్లు తాగడం వల్ల మీ బాడీకి ఎలాంటి శక్తి కూడా లభించదు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు నిపుణులను సంప్రదించండి.