/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/summer-heat-8.jpg)
Summer
రోజురోజుకీ ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంది. దీంతో నీరసం, అలసట అన్ని కూడా వస్తాయి. వేసవిలో వాటర్, పండ్లు, రసాలు వంటివి ఎక్కువ తీసుకోవడంతో పాటు పోషకాలు ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాలి. అప్పుడే వడదెబ్బ వంటి సమస్యల నుంచి విమక్తి పొందుతారు. అయితే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో తప్పకుండా కొన్ని రకాల గింజలను యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి వేసవిలో తీసుకోవాల్సిన ఆ గింజలు ఏంటో తెలియాలంటే ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి.
ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
చియా సీడ్స్
వేసవిలో చియా సీడ్స్‌ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు యంగ్ లుక్‌లో ఉండేలా చేస్తాయి. అలాగే బాడీ డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. వీటిని ఓట్స్‌లో కలిపి కూడా తినవచ్చు.
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
అలసంద గింజలు
వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు అంతా కూడా తగ్గుతుంది. ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్ బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అందాన్ని కూడా పెంచుతాయి.
పొద్దుతిరుగుడు గింజలు
ఈ గింజల్లో ఎక్కువగా జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి బాడీని చలవ చేస్తాయి. అలాగే నీరసం, అలసట వంటివి రాకుండా చేస్తాయి. డైలీ వీటిని సలాడ్ లేదా నేరుగా కూడా తినవచ్చు.
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
గుమ్మడికాయ గింజలు
వీటిలోని పోషకాలు కండరాలను బలంగా చేస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల వేసవిలో శరీరానికి శక్తి లభిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?