Summer: వేసవిలో వీటిని తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం

వేసవిలో జామ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బాడీకి చలవ చేయడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

New Update
Summer

Summer

సీజనల్‌గా లభ్యమయ్యే జామను తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామ కాయలో విటమిన్లతో పాటు ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తాయి. కేవలం వేసవిలోనే కాకుండా ప్రతీ సీజన్‌లోనూ జామ కాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే జామను వేసవిలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం. 

బాడీకి చలవ

జామ పండ్లలో ఎక్కువగా నీటి పరిమాణం ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. మీ బాడీకి ఎక్కువగా చలవ చేయడంలో జామ ముఖ్య పాత్ర పోషిస్తుంది. 

రోగనిరోధక శక్తి 
జామలోని విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా శరీరాన్ని కాపాడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా చేస్తుంది.

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

రక్తపోటు
జామ పండ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరచేందుకు బాగా సహాయపడుతుంది. రోజూ ఉదయం ఒక జామకాయ తినడం వల్ల ఇలాంటి సమస్యలు రావని నిపుణులు అంటున్నారు. 

జీర్ణక్రియ
జామకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు వంటివి రాకుండా చేస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు