/rtv/media/media_files/2025/03/19/XuTxmaNAAEvRSnC3SReK.jpg)
Fridge Water Photograph: (Fridge Water)
వేసవి కాలం వచ్చేసంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ సమయంలో అయినా కూడా వేడిగా ఉంటుంది. ఎండ తీవ్రతకు బాగా ఉక్కపోత ఉండటంతో చాలా మంది చల్లగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతున్నారు. ఇలా చల్లగా ఉండే వాటర్ తాగడం వల్ల ఆ నిమిషానికి హాయిగా ఉంటుంది. కానీ ఆ తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
కండరాల తిమ్మిరి వంటి సమస్యలు..
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో దాహంగా అనిపించి వేడివి కాకుండా చల్లని నీరు తాగుతుంటారు. దీని వల్ల తలనొప్పి, మూత్రం రాకపోవడం, అలసట, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ కంటే మట్టి కుండలో ఉన్న నీరు తాగడం ఆరోగ్యానికి ఇంకా మంచిదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
చల్లగా ఉన్న నీరు తాగితే జీర్ణాశయం పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారపదార్థాలు త్వరగా జీర్ణం కావు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అలాగే శ్వాసకోశంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. దీంతో ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీళ్లు తాగితే వెంటనే జలుబు చేయడం, గొంతు మంట లాంటివి గమనించవచ్చు. ఎక్కువ సార్లు ఈ నీళ్లు తాగితే ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుని ముక్కు దిబ్బడ, పొడిదగ్గు వేధిస్తాయి. దాహం అనిపించినప్పుడు బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే నాడీ వ్యవస్థ ప్రభావిత మవుతుంది. దీని వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర, చిగుళ్లలో ఉండే సున్నితమైన నరాలు దెబ్బతిని పళ్లు జివ్వుమంటాయి.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు