/rtv/media/media_files/2025/02/25/ZOCGzc8opKJqVtYq8iya.jpg)
summer
వేసవిలో బాడీకి బలాన్నిచ్చే వాటిని తీసుకోవాలి. పండ్లు, జ్యూస్‌లు, మజ్జిగ, నిమ్మరసం ఇలా ఇమ్యునిటీ పవర్‌ను పెంచే వాటిని తీసుకోవాలి. అప్పుడే వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ తేనెను తీసుకోవాలి. ఇందులోని పోషకాలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు నీరసం, అలసట వంటివి రాకుండా చేస్తాయి. అయితే తేనెను వేసవిలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!
ఇమ్యూనిటీ పవర్
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగినిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వేసవిలో ఎంత వాటర్ తాగినా కూడా బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. అదే తేనె, నిమ్మకాయ కలిపిన నీరు తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో వడదెబ్బ తగలదు. అలాగే శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. రోజంతా మీరు యాక్టివ్‌గా ఉండేలా కూడా చేస్తుంది.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
చర్మ ఆరోగ్యం
వేసవిలో చర్మం నల్లగా మారుతుంది. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఎల్లప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. ముఖానికి తేనెను అప్లై చేయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు. మచ్చలు, ముడతలు అన్ని కూడా తగ్గిపోతాయి.
ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!
నిద్రలేమి
ఉక్కపోత వల్ల వేసవిలో పెద్దగా నిద్ర పట్టదు. ఈ సమస్య నుంచి బయటపడటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. తేనెలో ట్రిప్టోఫాన్ అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!