SriRama Navami : శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీ కష్టాలు పరార్!

శ్రీరామ నవమి రోజున కొన్ని నియమాలు పాటించి పూజలు చేస్తే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు అంటున్నారు. నవమి రోజు అన్న, వస్త్ర దానం చేస్తే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుందని అంటున్నారు.

author-image
By Kusuma
New Update
Srirama navami

Srirama navami Photograph: (Srirama navami)

ప్రతీ ఏడాది ఛైత్ర మాసంలోని నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఈ పండుగను జరుపుకోనున్నారు. అయితే నవమి రోజు వేకువ జామునే నిద్ర లేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై ఓ పీటను అమర్చి.. పట్టు వస్త్రం లేదా కొత్త దుస్తులు సమర్పించాలి.

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

అమ్మవారికి పూలదండలు..

ఆ తర్వాత సీతారాముల చిత్రపటానికి పువ్వులు, బొట్టు పెట్టి.. పంచామృతాలతో అభిషేకం చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి.. రామయ్య తండ్రికి.. అమ్మవారికి పూల దండలు సమర్పించాలి.  చివరలో స్వామి పాదాల దగ్గర అక్షింతలు వేస్తూ హారతి చదవాలి. దీని తర్వాత రామచరిత మానస్, సుందరకాండ వంటివి పారాయణం చేయాలి. పూజ అంతా అయిన తర్వాత కూడా నైవేద్యంగా వడపప్పు, పానకం వంటివి సమర్పించాలని అంటున్నారు.

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

దీన్ని తర్వాత ఇతరులకు సమర్పించాలి. అలాగే వస్త్రాలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తేనే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయని పండితులు అంటున్నారు. అలాగే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఈ విషయాలపై సందేహాలు ఏవైనా ఉంటే మీ సమీపంలోని పండితులను సంప్రదించగలరు. 

Advertisment
Advertisment
Advertisment