/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-15-00-28.jpg)
Sri rama navami
శ్రీరామ నవమి పర్వదినం రోజున కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటున అయిన ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పాపం తగుతులుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే పవిత్రమైన శ్రీరామ నవమి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి? తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!
సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి..
శ్రీరామ నవమి నాడు భక్తులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. భక్తిశ్రద్ధలతో రాముడిని కొలిచే ఈ శుభదినాన పొరపాటున కూడా మాంసాహారం, మద్యం సేవించరాదు. అలాగే పండుగ రోజున తయారు చేసే వంటలలో అల్లం, వెల్లుల్లి ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు. శాస్త్రం ప్రకారం ఉల్లి, వెల్లుల్లి వంటివి ఉత్తేజాన్ని, క్రోధాన్ని కలిగిస్తాయి. దైవ చింతనలో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని పండితులు అంటున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం పండుగ రోజుల్లో శారీరక మార్పులకు సంబంధించిన పనులు కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్
ముఖ్యంగా శ్రీరామ నవమి నాడు జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి అశుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని, ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. పండుగ రోజున అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దైవ స్మరణలో గడపాలి. అంతే కానీ హింసాత్మక చర్యలకు అసలు పాల్పడకూడదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: యుద్ధరంగంలోకి భారత్.. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ప్రారంభించిన ఇండియన్ నేవీ
ఈ శ్రీరామ నవమి రోజున ఇతరులను దూషించడం, కించపరచడం లేదా అపహాస్యం చేయడం వంటి పనులు అస్సలు చేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలు ఆడకూడదు. రాముడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి, అధర్మమైన పనులకు, అసత్య మాటలకు దూరంగా ఉండాలి. అలాగే ఇతరులకు సాయం చేయడంతో పాటు బ్రహ్మచర్యం పాటించడం, నేలపై పడుకోవడం వంటివి కూడా చేయాలని పండితులు సూచించారు.
Follow Us