Sri Rama Navami 2026: సీతారామ కళ్యాణ మహోత్సవం సమయమిదే!

శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజునే ఈ కళ్యాణ వేడుకను జరుపుకుంటారు. సీతారామలు కళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. అంటే ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య నిర్వహించడం అత్యంత శుభప్రదం అని పండితులు తెలిపారు.

author-image
By Kusuma
New Update
sri rama navami 2026

sri rama navami 2026

హిందువుల పండుగలలో శ్రీరామనవమి ముఖ్యమైనది. పురాతన కాలం నుంచి శ్రీరామనవమి పండును ఎంతో పవిత్రంగా జరుపుకుంటున్నారు. అయితే శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించిన రోజునే ఈ కళ్యాణ వేడుకను జరుపుకుంటారు. సీతారామలు కళ్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. అంటే 27వ తేదీ ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య నిర్వహించడం అత్యంత శుభప్రదం అని పండితులు తెలిపారు. సూర్యుడు నడినెత్తిపై ఉండే ఈ సమయంలో రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ సమయంలోనే కళ్యాణం చేయడం శుభప్రదమని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

సఖ్యత కోసం రాముల వారి కళ్యాణం..

సీతారాముల కళ్యాణం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.. ఆదర్శవంతమైన దాంపత్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. సీతాదేవిని శక్తి స్వరూపిణిగా, శ్రీరాముడిని పరమాత్మగా భావిస్తారు. శ్రీరాముడిని ఏక పత్నీ వ్రతుడుగా, సీతమ్మ వారు పతివ్రతగా నిలిచి లోకానికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఈ కళ్యాణాన్ని చూడటం లేదా నిర్వహించడం వల్ల కుటుంబానికి మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అలాగే దంపతులు మధ్య సఖ్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. కష్టాల్లోఉన్నప్పుడు ధర్మాన్ని వీడకుండా ఎలా జీవించాలని సీతారాముల ద్వారా నేర్చుకోవచ్చని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుందో అలాంటి వారు సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే పెళ్లి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్థలు తొలగి శాంతి నెలకొంటుందని అంటున్నారు. రామరాజ్యంలో సుఖం, శాంతితో ఎలా ఉండేవారో అలాగే ఉంటారని నమ్ముతారు. ఇంట్లో కూడా అష్టశ్వైరాలు, సంపద కలుగుతాయని పండితులు పేర్కొంటారు. రామ నామ స్మరణతో చేసే ఈ పుణ్యకార్యం వల్ల మనసులోని భయాలు తొలగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజున పానకం, వడపప్పు నివేదన చేసి సీతారాముల కళ్యాణం దగ్గర ప్రసాదంగా పెట్టాలి.

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

ఇలా చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణాన్ని చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తారు. అయితే ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడలేని వారు తమ సమీపంలోని దేవాలయాల్లో లేదా ఇంట్లోనే రామపటాన్ని అలంకరించి పూజించుకోవచ్చు. రామ నామం జపిస్తూ రోజంతా ఉండటం వల్ల మంచి జరుగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: యుద్ధరంగంలోకి భారత్.. 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' ప్రారంభించిన ఇండియన్ నేవీ

Advertisment
తాజా కథనాలు