/rtv/media/media_files/2024/11/26/phonecallslatenight1.jpeg)
night time
చాలా మంది రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్రపోకుండా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అయితే తెలిసో తెలియక రాత్రిపూట చేసిన కొన్ని తప్పుల వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మీరు కూడా ఇలానే మిస్టేక్స్ చేస్తున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు
మొబైల్ చూడటం
ప్రస్తుతం రోజుల్లో చాలా మంది రాత్రి సమయాల్లో ఎక్కువగా మొబైల్ చూస్తున్నారు. వీటి నుంచి విడుదలయ్యే కిరణాల వల్ల కళ్లు దెబ్బతింటాయి. అలాగే నిద్రపట్టదు. కాబట్టి రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు అసలు మొబైల్ చూడవద్దు.
ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!
తొందరగా తినడం
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల తిన్న ఫుడ్ జీర్ణం కాదు. దీంతో కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు అన్ని వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిద్రపోవడానికి ఒక మూడు గంటల ముందు తినండి. దీనివల్ల తిన్న ఫుడ్ జీర్ణం అవుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది.
ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
కెఫిన్ తీసుకోవద్దు
కొందర రాత్రి సమయాల్లో కెఫిన్ ఉండే పదార్థాలు తీసుకుంటారు. వీటి వల్ల రాత్రి సమయాల్లో పూర్తిగా నిద్రపట్టదు. కాబట్టి సాయంత్రం నాలుగు గంటల తర్వాత కెఫిన్ ఉండే పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.