Happy New Year 2025 : దేశమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఏ కష్టాలు, అడ్డంకులూ లేకుండా జీవితం హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ ప్రజలు కొత్త ఏడాదిలో అడుగుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్, తిరుపతి, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లో డాన్సులు, ప్రత్యేక ప్రదర్శనలతో యువత అదరగొట్టారు. అయితే ఈ కొత్త సంవత్సరం మీకు శుభప్రదంగా, సానుకూలంగా ఉండడానికి జనవరి 1న కొన్ని పనులు చేస్తే మంచిదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : వారానికి రూ.200 కట్టలేక.. భార్యాభర్తల ఆత్మహత్య జనవరి 1న చేయాల్సిన పనులు హిందూ మతాలు, సంప్రదాయాల ప్రకారం బ్రహ్మ ముహూర్తాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పనులు మొదలు పెడితే శుభ ఫలితాలను ఇస్తాయని నమ్మకం. కావున కొత్త సంవత్సరంలో మొదటి రోజును బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభప్రదంగా ప్రారంభించండి. హిందూ మతంలో దానం చేయడాన్ని అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజున ఆర్ధిక స్థోమతకు తగ్గట్లు పేదలకు లేదా అవసరమైన వారికి సహాయం, దానం చేయడం ద్వారా శుభ ఆశీషులను పొందుతారు. నూతన సంవత్సరం మొదటి రోజున కుటుంబంతో కలిసి ఇష్ట దైవాన్ని ఆరాధించండి. కొత్త ఏడాది మీకు, మీ కుటుంబానికి సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని దేవుడిని ప్రార్థించండి. Also Read : గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించండి.. సీఎం వేడుకోలు! కొత్త ఏడాది సంతోషంగా సాగడానికి మొదటి రోజున చెడు అలవాట్లను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకోండి. చెడు విషయాలను వదిలిపెట్టడంతో పాటు.. మంచి అలవాట్లను పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకోండి. కొత్త సంవత్సరం రోజున సుఖ శాంతులు, లక్ష్మీ దేవిని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి ప్రధాన ద్వారాన్ని పూలదండలతో అలంకరించి, రంగోలి వేసి, దీపాలతో వెలిగించండి. ధార్మిక విశ్వాసాల ప్రకారం.. అరచేతిలో లక్ష్మీ సరస్వతి, విష్ణువు నివసిస్తారని నమ్ముతారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అరచేతిని చూసి కర్ దర్శన మంత్రాన్ని పఠించండి Also Read : ఈ నెలలో దాదాపు సగం రోజలు బ్యాంకు సెలవులే? గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు. Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై