AI technology : 14ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. 7 సెకన్లలోనే గుండె గుట్టు చెప్పే యాప్

నంద్యాల సిద్ధార్థ్ అనే 14ఏళ్ల బాలుడు AI సాయంతో పనిచేసే సిర్కాడియావీ అనే యాప్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయోచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్‌ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది.

New Update
14-year-old techie

14-year-old techie Photograph: (14-year-old techie)

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు నంద్యాల సిద్ధార్థ్‌ ఓ అద్భుత ఆవిష్కరణ చేశాడు. హార్ట్ చెక్‌అప్‌లు చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడకున్న పని. అంతేకాదు ఆ టెక్నాలజీ అన్నీ చోట్ల కూడా ఉండదు. కానీ ఇటీవల చాలామంది గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ఆకస్మిక మరణాలు పెరిగిపోతున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ విభాగంలో రోగులకు రెండు రోజులుగా గుండె జబ్బుల స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో ఓ స్పెషాలిటీ ఉంది. 14 బాలుడు కనిపెట్టి ఓ ఏఐ యాప్ సాయంతో హార్ట్ చెక్‌అప్‌లు చేస్తున్నారు. ఈ టెస్టులు సింపుల్‌గా స్మార్ట్‌ ఫోన్‌తో చేయడం అందరినీ ఆకర్షించింది.

Also read : Aamir Khan: 60ఏళ్ల వయసులోనూ బాలీవుడ్ హీరో డేటింగ్.. స్వయంగా ఆమె పేరు ప్రకటింపు

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అతడు స్వయంగా రూపొందించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో పనిచేసే సిర్కాడియావీ అనే యాప్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే వెంటనే మీ గుండె ఆరోగ్యం గురించి చెప్పేయోచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ను రోగి ఛాతీపై ఏడు సెకన్లపాటు ఉంచితే ఈ యాప్‌ హార్ట్ బీట్ రికార్డు చేస్తుంది. రోగికి గుండె జబ్బు ఉంటే బీప్‌ సౌండ్‌తో రెడ్‌ లైట్‌ వెలిగి గ్రాఫిక్‌లో అబ్‌నార్మల్‌ హార్ట్‌ బీట్‌ అనే పదాలు స్ర్కీన్‌పై కనిపిస్తున్నాయి. జీజీహెచ్‌ ఓపీలో దాదాపు 500 మందికి ఈ ఏఐ టెక్నాలజీతో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయగా, వారిలో పది మందికి గుండె జబ్బులు ఉన్నట్లు ఈ యాప్‌ తేల్చింది. వీరిని వార్డుకు తరలించి.. ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా.. ఆశ్చర్యకరంగా అందరికీ గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.  దీంతో డాక్టర్లు సిదార్థ్‌పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై

అనంతపురానికి చెందిన సిద్ధార్థ్‌ కుటుంబం 2010లో అమెరికాలో స్ధిరపడింది. తండ్రి మహేశ్‌ అమెరికాలో వ్యాపారవేత్త. సిద్ధార్థ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (డల్లా్‌స)లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఏఐ బేస్డ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో సిర్కాడియావీ అనే యాప్‌ను ఆవిష్కరించాడు. ఆ యాప్‌తో అమెరికాలో 15 వేల మందికి స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయగా.. 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది. 93 శాతం కచ్చితత్వంతో పనిచేసే ఈ యాప్‌ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు