Menopause: మెనోపాజ్ దశలో ఉన్నారా.. వీటిని తప్పకుండా తినండి

మెనోపాజ్ దశలో మహిళలు మానసికంగా ఎంతో ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయాల్లో పసుపు, గ్రీన్ టీ, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఈ దశలో వచ్చే సమస్యల నుంచి విముక్తి చెందుతారని నిపుణులు అంటున్నారు.

New Update
menopause

Menopause time eat these foods compulsory

Menopause: మెనోపాజ్ దశలో మహిళలు శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. ఈ సమయంలో ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, మతిమరుపు వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే ఇవే కాకుండా ఇంకా అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే మెనోపాజ్ దశలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని ఆహారాలను తినాలి. 

ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్‌పై దాడి జరిగేటప్పుడు నలుగురు మగ పనిమనుషులు అక్కడే.. వెలుగులోకి సంచలన నిజాలు

పసుపు

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండే పసుపును తప్పకుండా తీసుకోవాలి. ఇవి జ్వరం, వాపు, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తుంది. 

గ్రీన్ టీ
టీ, కాఫీ కంటే గ్రీన్ టీని మెనోపాజ్ దశలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ప్రమాదకర వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు.

ఇది కూడా చూడండి: Health: చిన్న బెల్లం ముక్కతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ..కానీ ఏ సమయంలో తినాలో తెలుసా!

కాల్షియం ఉండే పదార్థాలు 
మెనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా తగ్గుతాయి. దీంతో ఎముకలు ఆరోగ్యంగా ఉండవు. కాబట్టి ఈ సమయంలో కాల్షియం అధికంగా ఉండే వాటిని తీసుకోండి. ముఖ్యంగా పాలు, చీజ్, సోయా బీన్స్ వంటి ఆహారాలను తీసుకోండి. వీటి వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఇది కూడా చూడండి: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు

ఐరన్ ఉండే పదార్థాలు
మెనోపాజ్ దశలో ఐరన్ అధికంగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, నట్స్ వంటివి తీసుకోవాలి. వీటివల్ల బలంగా ఉంటారు.

వ్యాయామం
ఈ దశలో కనీసం వారానికి అయినా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఉంటారు.

ఇది కూడా చూడండి: Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment