Maha Shivratri 2025: శివలింగంపై ఈ వస్తువులు వేశారో.. ఇక దరిద్రం మీతోనే

శివలింగం అభిషేకానికి కుంకుమ, పసుపు, తులసి, ఎర్రటి పువ్వులు ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. వీటిని శివలింగంపై వేస్తే కోరిన కోరికలు నెరవేరవు. దరిద్రమంతా కూడా మీతోనే ఉండిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

author-image
By Kusuma
New Update
Maha Sivaratri 2025..

Maha Sivaratri 2025..

Maha Shivratri 2025: మహా శివరాత్రి పండుగను నేడు (ఫిబ్రవరి 26వ తేదీన) దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. భక్తితో శివుడిని మహా శివరాత్రి నాడు పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శివునికి అభిషేకం అంటే ఇష్టం. నీరు, పాలు ఇలా కొన్నింటితో అభిషేకాలు చేస్తారు. అయితే శివుడికి కొన్ని వస్తువులతో అసలు అభిషేకం చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులేంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

కుంకుమ, పసుపు

చాలా మంది శివలింగంపై కుంకుమ, పసుపు వేస్తుంటారు. శివునికి వీటితో అసలు అభిషేకం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కుంకుమ, పసుపు స్త్రీలకు సంబంధించినది. కాబట్టి శివు లింగానికి వీటితో అభిషేకం చేయకూడదు. 

ఇది కూడా చూడండి: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

తులసి
తులసి ఆకులను కూడా శివ లింగంపై వేయకూడదు. ఎందుకంటే తులసి రాక్షస వంశంలో జన్మించింది. అయితే ఈ రాక్షస వంశం శివుడిని శపించింది. ఈ కారణంగానే శివ లింగంపై తులసి ఆకులు వేయరు.

ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

శంఖాలు
శంఖంలో నీరు, పాలు వంటివి వేసి వాటితో శివ లింగానికి అభిషేకం చేయకూడదు. 

ఇది కూడా చూడండి: Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

ఎరుపు రంగు పువ్వులు
శివుడి ఎరుపు రంగు పువ్వులు అంటే నచ్చదు. వీటిని అసలు శివలింగానికి సమర్పించకూడదు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cracked heels: వేసవిలో పగిలిన మడమలకు చక్కటి పరిష్కారం

అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోతే మడమలు పగులుతాయి. మడమలు పగలకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాస్తే మంచిది. కొబ్బరి నూనెను మసాజ్, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

New Update
Cracked heels

Cracked heels

Cracked heels: వేసవి కాలంలో చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరం. ముఖ్యంగా ముఖం, చేతుల్ని శుభ్రంగా ఉంచే ప్రయత్నంలో పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మడమల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. ఇది శీతాకాలంలో మాత్రమే కాదు వేసవిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అధిక వేడి, పొడి బారిన చర్మం, తగిన మాయిశ్చరైజింగ్ లేకపోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వంటివి ప్రధాన కారణాలు మడమలు పగలడానికి దారితీస్తాయి. మడమలు పగలకుండా ఉండేందుకు రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాయడం ఎంతో మంచిది. 

చర్మం మృదువుగా..

గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్ర పరిచిన తర్వాత కొబ్బరి నూనెను మసాజ్ చేసి, కాటన్ సాక్స్ ధరించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇక తేనెను కూడా పాద సంరక్షణంలో ఉపయోగించవచ్చు. గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి పాదాలను 15-20 నిమిషాలు నానబెట్టడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. తర్వాత స్క్రబ్ చేసి, క్రీమ్ రాస్తే మడమల పరిస్థితి మెరుగవుతుంది.

ఇది కూడా చదవండి: ప్రోటీన్ పెరగడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయా?

కలబంద జెల్‌, గ్లిజరిన్‌ను కలిపి రాత్రిపూట అప్లై చేయడం వల్ల మడమల నొప్పి తగ్గి, చర్మం నయం అవుతుంది. కలబందలోని సహజ హీలింగ్ లక్షణాలు చర్మాన్ని లోపలి నుంచి పోషిస్తాయి. ఇంకా పండిన అరటిపండును కొబ్బరి నూనెతో కలిపి మడమలపై అప్లై చేస్తే అది సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు వేసవిలో మడమలను ఆరోగ్యంగా, మృదువుగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి. మడమల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీటిపై కూడా ముఖం లాగా శ్రద్ధ చూపడం అవసరం.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వేసవిలో చర్మ సమస్యలకు వేప ఆకులతో చెక్‌


( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment