/rtv/media/media_files/2025/02/25/ujf7EUfbpHZvyTCpiYXX.jpg)
Maha Shivratri 2025
మహాశివరాత్రికి హిందూ గ్రంథాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజు మహా శివరాత్రి పండుగను అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మహాశివరాత్రి బుధవారం అంటే ఫిబ్రవరి 26న పడింది.
ఈ పండుగను శివుని గొప్ప రాత్రి అని భావిస్తారు. చాలా మంది భక్తులు ఈ రోజున పూజలు చేయడం, ఉపవాసాలు ఉండటం వంటివి చేస్తారు. దీని కారణంగా శివుని నుండి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుందని హిందువులు నమ్ముతారు. శివుడు, పార్వతి వివాహ వార్షికోత్సవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. అందువల్ల ఆ రోజున భర్త తన భార్యకు ఓ బహుమతి ఇవ్వడం వల్ల ఆమెను సంతోషపెట్టగలడని నమ్ముతారు. అంతేకాకుండా ఆమెకు అదృష్టాన్ని సైతం తీసుకురాగలడని హిందువుల నమ్మకం.
Also Read: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
ఈ బహుమతి ఇవ్వాలి
ఇది మాత్రమే కాకుండా శుక్రుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని వారి గట్టిగా నమ్ముతారు. అందువల్ల మహాశివరాత్రి సందర్భంగా భర్త తన భార్యను ధనవంతురాలిగా మార్చేందుకు ఆమెకు ఎలాంటి కానుక ఇస్తే శుభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క భర్త మహాశివరాత్రి నాడు తన భార్యకు వెండి పట్టీలను బహుమతిగా ఇస్తే చాలా మంచిదని అంటున్నారు.
Also Read: మహా కుంభమేళా పై రాంగ్ న్యూస్... 140 సోషల్ మీడియా అకౌంట్ల పై కేసు నమోదు!
ఎందుకంటే దీని వల్ల శుక్రుని అనుగ్రహం లభిస్తుందట. శుక్రుని బలం లేదా ఆనందం వల్ల ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా జీవితంలో అన్ని రకాల విలాసాలు, సుఖాలు లభిస్తాయని కొందరు చెబుతున్నారు. అది మాత్రమే కాకుండా లైఫ్ లో ప్రేమ అధికంగా పెరుగుతుంది. ఇంకా లగ్జరీ, సంపద, సంబంధాలు కూడా గట్టిగా ఉంటాయని నమ్ముతారు.
Also Read: అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతడితో ఆ సీన్‌లలో అయినా ఓకే: టాలీవుడ్ హీరోయిన్!
ఈ మహా శివరాత్రికి మీ భార్యకు వెండి పట్టీలను గిఫ్ట్ గా ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక వెండి పట్టీలు ధరించడం వల్ల కూడా ఎన్నో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. వెండి పట్టీల వల్ల చంద్రగ్రహం బలపడుతుంది. దీంతో ఇల్లు, ఫ్యామిలీ నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోయి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. శారీరకంగానూ, మానసికంగానూ సానుకూలత పెరుగుతుంది. అది మాత్రమే కాకుండా వైవాహిక జీవితంలో శాంతి, ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది.