/rtv/media/media_files/2025/03/07/whhKjMZ6Bg5KmE0JNljf.jpg)
summer tips
Summer Tips: వేసవి వచ్చేసింది.. బయట ఎండలు భగ్గుమంటున్నాయి. మార్చి రెండవ వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం మొదలు పెట్టాయి. ఈ వేడి ప్రభావం ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణ పై కూడా తీవ్ర్ ప్రభావ చూపిస్తుంది. వేసవి కాలంలో చర్మ సంరక్షణ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే వడదెబ్బ తగిలి ప్రాణాలకే ముప్పు కలిగే ప్రమాదం ఉంటుంది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సూర్యకాంతి ప్రభావం
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం పొడిబారటం, ముడతలు పడటం, బ్లాక్హెడ్స్, సన్ బర్న్, టాన్, చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది. సూర్య కిరణాలూ చర్మాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బయట ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు.
సన్‌స్క్రీన్
ఎండకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ తప్పనిసరిగా అవసరం. సన్ స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లడం ద్వారా చర్మానికి చాలా హాని జరుగుతుంది. కనీసం SPF 30 లేదా 50 సన్‌స్క్రీన్ ను వాడాలి. బయటకు వెళ్లే 20-30 నిమిషాల ముందే దీన్ని అప్లై చేయాలి. అలాగే ప్రతీ రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేస్తే మరింత రక్షణ పొందుతారు.
తేలికపాటి బట్టలు, స్కార్ఫ్, గ్లాసెస్
ఎండాకాలంలో తేలికపాటి బట్టలు ధరించాలి. ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఉండేలా మీ బట్టలు ఉండాలి. కాటన్ లేదా లినెన్ బట్టలు వేసుకోవడం ఉత్తమం. అలాగే ముఖాన్ని, మెడను కప్పేందుకు స్కార్ఫ్ ఉపయోగించండి. కళ్లను UV కిరణాల నుంచి కాపాడేందుకు మంచి క్వాలిటీ సన్‌గ్లాసెస్ ధరించాలి.
హైడ్రేషన్
వేసవిలో నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం, పుచ్చకాయ వంటి హైడ్రేటింగ్ పానీయాలను తీసుకుంటే, చర్మం తాజాగా ఉంటుంది.
సరైన ఆహారం
వేసవిలో ఎక్కువగా పచ్చి కూరగాయలు, పండ్లు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినాలి. విటమిన్ C, విటమిన్ E వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే, చర్మం ఆరోగ్యంగా,అందంగా కూడా ఉంటుంది. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల చర్మ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కూలింగ్ మాస్క్
వేసవిలో చర్మానికి తేమను అందించేందుకు ఇంట్లోనే కొన్ని నేచురల్ మాస్క్‌లు వాడొచ్చు. కీర దోసకాయ పేస్ట్, యోగర్ట్, ఆలెవెరా జెల్, గులాబీ నీరు వంటి చల్లదనాన్ని అందించే పదార్థాలను ముఖానికి అప్లై చేస్తే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 హోస్టుగా ఊహించని స్టార్ హీరో! నాగార్జున గుడ్ బై