/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Pearl-millet-11-jpg.webp)
సాధారణంగా సగ్గుబియ్యంలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, ఐరన్ , మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, కండరాలను బలోపేతం చేయడం, గుండె పనితీరును మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. సగ్గుబియ్యంతో టిక్కీ, కిచిడి, ఖీర్ వంటి ఆహారాలు తయారు చేసుకోవచ్చు. అయితే దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండడం మంచిది.
ఎవరు తినకూడదు
అధిక బరువు
బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు సగ్గుబియ్యంతో చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిలో సాగోలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కేలరీలను పెంచుతుంది. అలాగే ప్రోటీన్ ఫైబర్ తక్కువగా ఉంటాయి. తద్వారా బరువు తగ్గడానికి సరైనదిగా పరిగణించబడదు.
డయాబెటిస్ రోగులు
సగ్గుబియ్యం అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు మరింత సమస్యను ఎదుర్కుంటారు.
జీర్ణ సమస్యలు
సగ్గుబియ్యంలో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది, దీని కారణంగా మీకు కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం అనిపించవచ్చు. ఆలాగే దీనిలో ఫైబర్ తక్కువ.. కావున త్వరగా జీర్ణమవదు.
తగిన పరిమాణంలో
సగ్గుబియ్యంలో అధిక మొత్తంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల, ఎక్కువ పరిమాణంలో తింటే బరువు పెరగవచ్చు. తగిన పరిమాణంలో తీసుకోవడం ఆరోగ్యకరం.
life-style | latest-news | helath | telugu-news
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.