తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు పాటు సంక్రాంతి వేడుకలను కనుల పండువుగా జరుపుకుంటారు. అయితే ఈ మూడు రోజుల్లో మకర సంక్రాంతి పండగ చాలా ముఖ్యమైనది. హిందూ పురాణాల ప్రకారం.. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశికి అధిపతి అయిన తన కుమారుడు శనిదేవుడిని కలవడానికి వస్తాడు. అందుచేత తండ్రీ, కొడుకుల మధ్య ఆరోగ్యకరమైన బంధానికి ఈ పండగ ప్రతీకగా చెబుతారు. అలాగే రాక్షసులపై విష్ణువు సాధించిన విజయానికి ప్రతీకగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది మకర సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలి. పూజలకు పుణ్యసమయం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మకర సంక్రాంతి పూజలకు పుణ్య సమయం..
మకర సంక్రాంతి (Makar Sankranti) పండుగను పౌష మాసంలోని శుక్ల పక్షంలోని ద్వాదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజు నుంచి ఖర్మాలు ముగుస్తాయి. వివాహం, నిశ్చితార్థం, ముండ, గృహప్రవేశం మొదలైన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఉదయతిథి ప్రకారం.. ఈ సారి మకర సంక్రాంతిని 14 జనవరి 2025న జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, మకర సంక్రాంతి పుణ్యకాల సమయం ఉదయం 9.03 నుంచి సాయంత్రం 5.46 వరకు. అలాగే మహాపుణ్య కాల సమయం ఉదయం 9.03 నుంచి 10.48 వరకు ఉంటుంది.
Also Read : రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ లో కీలక మార్పు!
మకర సంక్రాంతి రోజున చేయాల్సిన పనులు..
- మకర సంక్రాంతి రోజున, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో పూజ చేయండి. దీనితో పాటు సూర్య భగవానునికి నీరు కూడా సమర్పించాలి.
- మకర సంక్రాంతి రోజున పుణ్య నదులలో స్నానం చేయడం వలన పాపాల నుంచి విముక్తి , మోక్షం లభిస్తుంది. గంగానదిలో స్నానం ఆచరించి.. ఇంట్లో కూడా గంగాజలాన్ని చల్లాలి.
- అలాగే మకర సంక్రాంతి రోజున పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున తర్పణం చేయడం వల్ల ఇంటిలోని పితృదోషాలు తొలగిపోయి పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది.
- మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులు, ఖిచ్డీ, ఉరద్ పప్పు లేదా నెయ్యితో చేసిన వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
Also Read: Game Changer: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ లో కీలక మార్పు!
Also Read : 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్