/rtv/media/media_files/2025/01/16/gsjGeXnRZwBExUAmutKJ.jpg)
overweight men
Obesity: సాధారణంగా అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక బరువు కారణంగా గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అయితే తాజా పరిశోధనల్లో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. పురుషుల్లో అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరమని వెల్లడైంది.
స్పెర్మ్, DNA ప్రభావితం..
సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన రిబీరో ప్రిటో మెడికల్ స్కూల్ పరిశోధకులు.. పురుషుల్లో అధిక బరువు స్పెర్మ్, DNA నిర్మాణం, నాణ్యతను ప్రభావితం చేస్తోందని ఇటీవలే జరిపిన ఓ పరిశోధనలో కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 89మంది తల్లిదండ్రులు అలాగే వారి నవజాత శిశువుల బరువును పరిశీలించగా.. తండ్రి BMI ఎంత ఎక్కువగా ఉంటే, వారి పిల్లల తల చుట్టుకొలత అంత చిన్నదిగా ఉంటుందని వెల్లడైంది.
పరిశోధకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు పిండం పెరుగుదల అలాగే తల్లి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు జరిగాయి. అయితే తల్లి ఆరోగ్యం మాత్రమే కాదు తండ్రి ఆరోగ్యం కూడా పిండాన్ని ప్రభావితం చేస్తుందని.. ఇప్పుడు జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. దీనికి సంబంధించి మొదటి పరిశోధన బ్రెజిలియన్ కుటుంబాలపై చేసినట్లు తెలిపారు.
Life Style: పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు? ప్రధాన కారణాలివే
ఇందులో తండ్రి BMI ఎక్కువ ఉన్న పిల్లల బర్త్ వేట్ తక్కువగా ఉంటుందని తేలింది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం. అనారోగ్యకరమైన జీవన శైలి తండ్రి నుంచి బిడ్డకు వచ్చే జన్యువులలో మార్పులకు కారణమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి పోషకాహారానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఎంత ముఖ్యమో, గర్భధారణకు ముందు తండ్రి జీవనశైలిని మార్చడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!