/rtv/media/media_files/2025/03/24/C8QywZMJ22kjynd4bzQt.jpg)
machine coffee effects
అబ్బా.. తల బద్దలవుతుంది! వెంటనే ఒక కాఫీ పడాల్సిందే అంటూ ఆఫీసు క్యాంటీన్ కి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ ఉండే కాఫీ వెండింగ్ మెషిన్ నుంచి ఒక కప్పు కాఫీ తీసుకొని తాగేస్తారు. అలా రోజుకు కనీసం నాలుగు, ఐదు సార్లు అయినా కాఫీ తాగడం చేస్తుంటారు. కానీ అక్కడే మీ ఆరోగ్యానికి అసలైన ముప్పు మొదలవుతుందని ఎప్పుడైనా ఊహించారా? ఇటీవలే జరిగిన ఒక పరిశోధనలో మెషీన్ కాఫీ తాగడంపై షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మెషీన్ నుంచి వచ్చే కాఫీ కొలెస్ట్రాల్, గుండె సంబంధిత సమస్యలను పెంచుతున్నట్లు పరిశోధనలో తేలింది.
ఉప్ప్సల విశ్వవిద్యాలయం చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ జరిపిన అధ్యయనంలో ఫిల్టర్ పేపర్ తో తయారు చేసిన కాఫీ కంటే మెషీన్ కాఫీలో కొలెస్ట్రాల్ ను పెంచే సమ్మేళనాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 14 వేర్వేరు కార్యాలయ యంత్రాల నుంచి కాఫీని కాఫీని సేకరించి ఈ పరిశోధనను విశ్లేషించారు.
Also Read : ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటు ప్రమాదకరమా?
కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం
అయితే కాఫీ గింజల్లోని కేఫెస్టోల్, కహ్వియోల్ వంటి సమ్మెళనాలు కొలెస్ట్రాల్ ని పెంచుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెషీన్ కాఫీ తాగడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే మెషీన్ లోఉపయోగించే మెటల్ ఫిల్టర్లు కారణంగా.. కొలెస్ట్రాల్ సమ్మేళనాలు నేరుగా కాఫీలోకి ప్రవేశిస్తాయి. అదే ఫిల్టర్ పేపర్ తో తయారు చేసిన కాఫీలో.. ఆ పేపర్ కొలెస్ట్రాల్ సమ్మేళనాలను లోపలి రాకుండా ఆపుతుంది. అందుకే మెషీన్ కాఫీకి బదులుగా ఫిల్టర్ పేపర్ తో చేసిన కాఫీ తాగితే.. చెడు కొలెస్ట్రాల్ 0.58 mmol/L తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read : రాగి నీటి బాటిల్ vs స్టీల్ బాటిల్.. ఆరోగ్యానికి ఏది మంచిది?
/rtv/media/media_files/2025/03/24/uz7uHNqqUfu0Uh18id8X.jpg)
Also Read : విటమిన్ బి12 లోపం వల్ల ఈ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయా..అయితే జాగ్రత్త!
మెషీన్ తో తయారుచేసిన కాఫీలో లీటరుకు 176 మిల్లీగ్రాముల కెఫెస్టోల్స్ (కొలెస్ట్రాల్ ని పెంచే సమ్మేళనం) ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. అదే పేపర్ తో ఫిల్టర్ చేసిన కాఫీలో లీటరుకు 12 మిల్లీగ్రాముల కెఫెస్టోల్స్ ఉన్నట్లు తేలింది. రోజుకు 3 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల మెషీన్ కాఫీ తాగే ఉద్యోగులు తెలియకుండానే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుకుంటున్నారని ఈ అధ్యయనం పేర్కొంది.
Also Read : రివర్స్ వాకింగ్‌తో ఇన్ని లాభాలా? ఎలా చేయాలో తెలుసా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
machine coffee | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style