/rtv/media/media_files/2025/03/22/iIewULv8e9jU7vxjS3gp.jpg)
eating food and watching mobile
Life Style: ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్స్, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు.. ఉదయం నిద్రలేచిన వెంట నుంచి రాత్రి పడుకునే వరకు సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. గంటల తరబడి ఫోన్ల ముందే కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కొంతమంది తినే సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉంటాయి. ఫోన్ చూస్తూ ప్లేట్ లో ఏముందో కూడా పట్టించుకోకుండా తినేవారుంటారు.
Also Read: Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!
/rtv/media/media_files/2025/03/22/Mtnd28cxFNEXBOZ1rvUw.jpg)
తినేటప్పుడు ఫోన్ చూస్తే ప్రమాదం!
అయితే ఈ అలవాటు చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మొబైల్ చూస్తూ భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. తినేటప్పుడు ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తినాలి. అప్పుడే అరుగుదల మెరుగ్గా ఉంటుంది. తినే సమయంలో దృష్టి అంతా ఫోన్ పై ఉండడం ద్వారా ఎంత తింటున్నాము? ఏం తింటున్నామో కూడా తెలియదు. దీని కారణంగా ఊబకాయం, పోషకాహారం వంటి జీవన శైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
life-style | health obesity
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!