/rtv/media/media_files/2025/03/22/957nmbk7gwloR4nIMshR.jpg)
cancer prevention MEDSRX formula
Cancer: క్యాన్సర్ మహమ్మారి ఎప్పుడు, ఎలా ఎవరిని పట్టిపీడిస్తుందో తెలియదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపర సమస్యలు ఇలా అనేక కారణాల చేత క్యాన్సర్ బారిన పడవచ్చు. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. దాదాపు 100కి పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. 2025లో, దాదాపు 2.04 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు రావచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ వ్యాధి నివారణకు ఇంకా దేశంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే క్యాన్సర్‌కు శాశ్వత నివారణ కనుగొనబడనప్పటికీ.. దీనిని అరికట్టేందుకు ఒక మార్గం కనుగొనబడింది.
ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న డాక్టర్ తరంగ్ కృష్ణ క్యాన్సర్‌ను నివారించడానికి ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. అదే MEDSRX ఫార్ములా. ఈ ఫార్ములా ఆరు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. ఇవి మనిషిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు క్యాన్సర్ ని నివారించడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
MEDSRX ఫార్ములా అంటే ఏమిటి?
M- ధ్యానం
మానసిక, శారీరక ఆరోగ్యానికి మెడిటేషన్ ఒక ఉత్తమమైన ఎంపిక. ప్రతిరోజూ ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
E- వ్యాయామం
ప్రతి రోజూ నిమిషాలు వ్యాయామం ద్వారా శరీరం బలంగా మారుతుంది. వారానికి ఒకసారి 150 నిమిషాలు పాటు తేలికపాటి వాక్, యోగా, నడక లేదా స్విమ్మింగ్ చేయడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
D-డైట్
ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం క్యాన్సర్‌ను శరీరం నుంచి దూరంగా ఉంచుతుంది. ఫైబర్ అధికం, విటమిన్ C, విటమిన్ E, పోటోకెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహారం క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. అలాగే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర లేదా కొవ్వు ఆహారాలకు దూరంగా ఉండాలి.
S-స్లీప్
నిద్ర కూడా క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో చాలా ముఖ్యమైనది. మంచి నిద్ర DNA ని రిపేర్ చేయడంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడుతుంది. సరైన నిద్ర లేకపోవడం శరీరంలో వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలను పెంచుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
R- రిలేషన్
కుటుంబంతో, స్నేహితులతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం మనసిక శాంతిని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు మానసిక ధైర్యాన్ని పెంచుతాయి. ఇది క్యాన్సర్ తో పోరాడే రోగులకు మానసికంగా చాలా సహాయపడుతుంది.
X- ది X ఫ్యాక్టర్
X అనేది ప్రతిరోజు అలవాటుగా అనుసరించే ఆనందకరమైన కార్యకలాపాలు, మీకు ఇష్టమైన పనులు చేయడం వంటి వాటిని సూచిస్తుంది. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, మనశాంతిని పెంచుతాయి.
telugu-news | latest-news | life-style
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.