/rtv/media/media_files/2025/03/02/11sJqnFJ9hFYYYxG5M88.jpg)
SLEEPING TIPS
Life Style: రాత్రిళ్ళు పడుకోగానే కొందరు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. మరో కొందరికి చాలా ఆలస్యంగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 5 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం నిద్రలేమి సమస్యలకు సంకేతం కావచ్చు. అలాగే ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోపే నిద్రలోకి జారుకోవడం కూడా ప్రమాదకరమైన వైద్య పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
Also read : Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!
ఎంత సమయంలో నిద్రపోవాలి..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 5 నుంచి 20 నిమిషాల్లో నిద్రలోకి వెళ్లడం ఆరోగ్యకరమైనది. చాలా త్వరగా నిద్రపోవడం నార్కోలెప్సీ వంటి వైద్య పరిస్థితికి సంకేతం కావచ్చు. అలాగే నిద్రపోవడానికి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం నిద్రలేమి సమస్యకు సంకేతం. కావున ఇలాంటి నిద్ర సమస్యలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించాలి.
Also Read: Pellikani Prasad: హైప్ అదిరింది.. ప్రభాస్ తో 'పెళ్లికాని ప్రసాద్' టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే
స్లీప్ హెల్త్ ఫౌండేషన్ అధ్యనాల ప్రకారం.. 18 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల వారు ప్రతి రాత్రి 7 నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తుంది. అయితే, ప్రతి 5 మందిలో ఒకరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులపాటు నిద్రలేమి సమస్యను ఎదుర్కోవడం.. గుండె జబ్బులు, స్ట్రోక్, ఊబకాయం, అధిక రక్తపోటు, నిరాశ, ఆందోళన, అల్జీమర్స్ వంటి అనేక తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సరైన నిద్ర లేకపోవడం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఇది కాలక్రమేణా తీవ్రంగా మారుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also read : Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!