Weight Loss : ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే.. ఈ రెండింటిలో ఏది మంచిది? ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే బెల్లం కంటే తేనె వాడటం బెటర్. తేనె సహజంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 16 Oct 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి చాలామంది ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఫిట్‌గా ఉండాలని అనుకుంటారు. బరువు తగ్గాలని ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తుంటారు. తీపి పదార్థాలు తినకుండా.. వాటికి బదులు బెల్లం, తేనె వంటివి వాడుతారు. అయితే ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిదే. కానీ బరువు తగ్గడానికి రెండింట్లో ఏది మంచి ఫలితాన్ని ఇస్తుందో కొందరికి తెలియదు. రెండింట్లో కూడా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి బెల్లం మంచిదా? తేనె మంచిదా? అనే విషయాలు తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: Drunkers : మందుబాబుల కోసం డ్రాపింగ్ వ్యాన్...కలెక్టర్ కి వినతి పత్రం! బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి బాగా ఉపయోగపడుతుంది. అయితే బరువు ఎక్కువగా ఉండి, రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు అయితే బెల్లం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యంగా బరువు తగ్గడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి చెందుతారు. రోజుకి చిన్న ముక్క బెల్లం తినడం వల్ల శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. ఇది కూడా చూడండి: Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం తేనెతో కలిగే ప్రయోజనాలుయాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలు తేనెలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి గొంతు ఇన్ఫెక్షన్, జలుబు తగ్గడంతో పాటు బాడీలో కొవ్వు అంతా తగ్గుతుంది. తేనెను నిమ్మకాయ రసంలో కలిపి తాగడం వల్ల తక్షణమే శక్తి రావడంతో పాటు ఈజీగా బరువు తగ్గుతారు. అయితే అధిక బరువు ఉన్నవారు మాత్రమే ఈ చిట్కా పాటించడం మేలు. ఇది కూడా చూడండి: Flights: ఎయిర్ ఇండియాతో పాటూ మరికొన్ని విమానాలకు బాంబు బెదిరింపు రెండింట్లో ఏది మంచిది? బెల్లం, తేనె రెండింట్లో కూడా పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ బెల్లం మీద తేనె సహజంగా దొరుకుతుంది. దీనిని బరువు తగ్గడానికి వాడటం మంచిది. అయితే ఐరన్ లోపం ఉన్నవారు తేనెను, ఖనిజ లోపం ఉన్నవారు బెల్లాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇది కూడా చూడండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #life-style #weight-loss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి