Breakup: బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే?

బ్రేకప్ బాధ నుంచి బయట పడాలంటే ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, ట్రావెల్ చేయడం వల్ల బ్రేకప్ నుంచి విముక్తి పొందుతారు.

New Update
Breakup

ఈ రోజుల్లో బ్రేకప్ సాధారణమే. స్కూల్ చదివే పిల్లలకు కూడా బ్రేకప్ అంటే ఏంటో తెలుసు. అయితే భాగస్వామి తప్పు చేశారనో, వ్యక్తిగత కారణాలు, కోపం వల్ల భాగస్వామితో బ్రేకప్ చేసుకుంటారు. కోపంలో ఏదో నిర్ణయాలు తీసుకోవడమే కానీ భాగస్వామి లేకుండా అసలు ఉండలేరు. వారి జ్ఞాపకాలతో బాధపడుతుంటారు. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించిన కూడా కొందరి వల్ల కాదు. భాగస్వామి మీద ప్రేమను చంపుకోలేరు.. వేరే వారి మీద ఇష్టం కూడా పెంచుకోలేరు. దీనివల్ల వారు జీవితంలో బాధపడుతుంటారు. దీని నుంచి బయటపడాలంటే ఈ నియమాలు పాటించండి. 

ఇది కూడా చూడండి: ఉదయం లేచిన వెంటనే తలనొప్పి వస్తోందా? అయితే తస్మాత్ జాగ్రత్త!

ఒంటరిగా ఉండవద్దు..

బ్రేకప్ నుంచి విముక్తి చెందాలంటో ఒంటరిగా కూర్చోవద్దు. కొందరు ఒంటరిగా కూర్చోని భాగస్వామి జ్ఙాపకాలతో బాధపడుతుంటారు. ఇలా కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం వల్ల బ్రేకప్ బాధ నుంచి విముక్తి పొందుతారు. ఏ పనులు చేస్తే మీకు సంతోషం కలుగుతుందో అవే పనులు చేయండి.  

ఇది కూడా చూడండి: యంగ్ హీరోయిన్లను డామినేట్ చేసేలా.. అందంతో మెప్పిస్తున్న బ్యూటీ

బ్రేకప్ తర్వాత కొత్త విషయాలపై ఇంట్రెస్ట్ చూపించండి. వర్క్‌లో బిజీగా ఉండటం, కొత్త విషయాలను నేర్చుకోవడంపై సమయం వెచ్చించడం వల్ల బాధను మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ బిజీగా ఉంటే అంత తొందరగా బాధను మర్చిపోతారు. 

ఇది కూడా చూడండి: ఇరాన్‌పై ప్రతీకార దాడులు.. విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
 
ఎక్కడికి వెళ్లకుండా ఒంటరిగా కూర్చోని బాధ పడటం కంటే కొత్త ప్రదేశాలకు వెళ్లడం అలవాటు చేసుకోండి. స్నేహితులతో టూర్‌కి వెళ్లడం లేదా ఒంటరిగా ట్రావెల్ చేస్తే తొందరగా బ్రేకప్ బాధ నుంచి బయటపడతారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడటం వల్ల మీరు మనస్సులో ఉండే బాధను మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇది కూడా చూడండి:  పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు

Advertisment
Advertisment
Advertisment