Horoscope Today: పన్నెండు రాశుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం. మేషం ఈ రోజు మీకు సంతోషం ఉండదు. కుటుంబంలో గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి ప్రతీ విషయంలో ఆచూతూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధు, మిత్రులతో అప్రమత్తంగా ఉండాలి. వృషభం ఈ రోజు అన్నింటా మీకు విజయమే లభిస్తుంది. శత్రుబాధలు ఇక ఉండవు. శుభవార్తలతో పాటు గౌరవ, మర్యాదలు కూడా దక్కుతాయి. అయితే కుటుంబంలో సమస్యలు తప్పువ. కాబట్టి ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిథునం అనుకున్న పనులు అన్ని కూడా నెరవేరుతాయి. కాకపోతే పిల్లల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి అజాగ్రత్త తప్పదు. కర్కాటకం మనస్సు చంచలంగా ఉంటుంది. కాబట్టి ఎవరితో విరోధం పెట్టుకోకుండా ఉండండి. ఆకస్మిక కలహాల అవకాశం ఉంది. కాబట్టి విభేదాలకు తావు ఇవ్వద్దు. సింహం ఏ పని తలపెట్టిన ఆటంకాలు వస్తాయి. ఆత్మస్థై్ర్యంతో ముందుకు వేయండి. మోసపోయే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా కాస్త ఇబ్బంది కరంగా ఉంటాయి. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండండి. కన్య విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తప్పవు. ఆర్థికంగా లాభం పొందుతారు. తుల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమస్యలు కాస్త క్లియర్ అవుతాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగుతాయి. వృశ్చికం ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అన్ని సమస్యలు ఈ రోజు క్లియర్ అవుతాయి. కాకపోతే ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కీళ్ల నొప్పులు, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ధనుస్సు గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. మకరం కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఇతరులతో వైరం రాకుండా చూసుకోండి. కుంభం నేడు దైవ దర్శనం చేసుకుంటారు. మానసికంగా కుంగిపోతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. మీనం నేడు భయాందోళనలతో ఉంటారు. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఆర్థిక సమస్యలు తప్పవు.