కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. ఈ క్రమంలో కొందరు వారి రాశిఫలం ఎలా ఉందని తెలుసుకుంటారు. అయితే ఈ కొత్త ఏడాదిలో కొన్ని రాశుల వారికి కుభేర యోగం ఉంది. ఈ ఏడాది వారు ఏం చేసిన కూడా పట్టిందల్లా బంగారమే. బొగ్గు పట్టిన కూడా ఆఖరికి బంగారమయ్యే రాశులు ఉన్నాయి. మరి ఆ రాశులేంటో తెలియాలంటో ఆర్టికల్‌పై ఓ లుక్కేయండి. Also Read : తిరుపతిలో దారుణం.. రూ.1500 కోసం మర్డర్.. అసలేమైందంటే? మేషం ఈ ఏడాది మేష రాశి వారికి మిశ్రమంగా ఉండబోతోంది. సుఖ సంతోషాలతో సాఫీగానే ఏడాది గడిచిపోతుంది. కాకపోతే ఆర్థిక సమస్యలు కాస్త అధికం అవుతాయి. ముఖ్యంగా వ్యాపారులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కుటుంబంలో ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడతారు. కెరీర్ విషయంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఏడాది ప్రారంభం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న చివరికి మాత్రం శుభవార్తలు అందుకుంటారు. వృషభంఈ ఏడాది వృషభ రాశి వారికి అసలు తిరుగు లేదు. ఏ పని మొదలు పెట్టిన కూడా విజయం మీదే. సంవత్సరం మధ్యలో ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది. కానీ ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తవుతాయి. మిథునంమిథున రాశి వారు ఈ ఏడాది అనేక విజయాలు సాధిస్తారు. కానీ కష్టాలు మాత్రం తప్పవు. కుటుంబంలో విభేదాలు, మానసకి ఒత్తిడి, కార్యాలయాల్లో సమస్యలు తప్పవు. ఈ ఏడాది వీరికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు వీరికి ఎక్కువ అవుతాయి. ఈ ఏడాది ఆరోగ్యం పట్ల మిథున రాశి వారు జాగ్రత్త వహించాలి. కెరీర్ విషయంలో విజయం సాధించాలంటే ఎక్కువగా కష్టపడాలి. ఇతరులతో ఎక్కువగా విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. Also Read : పీరియడ్స్‌ను విస్మరిస్తే ఈ వ్యాధి రావచ్చు కర్కాటకంకర్కాటక రాశికి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే. మధ్యలో చిన్న సమస్యలు వచ్చిన కూడా జీవితంలో మంచి మార్పులు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు క్లియర్ అవుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్ విషయంలో ఈ ఏడాది చాలా బాగుంది. పరీక్షలు, చదువు, ఉద్యోగం కోసం ప్రయత్నించిన అన్ని సఫలం అవుతాయి. సింహరాశిసింహరాశి వారికి 2025 చెత్త ఏడాదని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం వీరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. వ్యాపారాల్లో నష్టాలు రావడం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకదానితో ఏడాది మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఇయర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువగా కష్టపడితే కెరీర్‌లో విజయం సాధిస్తారు. కన్యా రాశికొత్త సంవత్సరంలో కన్యా రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్న కూడా అపజయాలే కానీ విజయాలు సాధించారు. కుటుంబంలో విభేదాలు పెరుగుతాయి. దారుణ పరిస్థితులు ఎదురు అవుతాయి. దీనివల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రారంభించిన ప్రతీ పనిలో ఆటంకం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో ఎక్కువగా నష్టాలు పొందుతారు. తుల రాశిఈ ఏడాది తుల రాశి వారు సంతోషంగా ఉంటారు. చేసిన ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ గౌరవ ప్రతిష్టలు ఈ ఏడాది పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. Also Read : రాంచరణ్ పై బాలయ్య సీరియస్.. వైరల్ అవుతున్న వార్నింగ్ వీడియో! వృశ్చిక రాశివృశ్చిక రాశి వారు ఈ ఏడాది శుభవార్తలు వింటారు. గొడవలు, విభేదాలు ఉన్నవి అన్ని కూడా తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కానీ వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు ప్రారంభిస్తే లాభాలు వస్తాయి. బంధువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. కెరీర్ విషయంలో ఈ ఏడాది విజయాలు సాధిస్తారు. ఏ కొత్త పని ప్రారంభించిన కూడా విజయం తథ్యం. ధనుస్సు రాశిఈ ఏడాదిలో ధనుస్సు రాశి వారికి అసలు బాగలేదు. ఏడాది అంతా సమస్యలతో నిండిపోతుంది. మంచి కోసం ఇతరులతో మాట్లాడిన కూడా వాగ్వాదంలా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థికంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. కెరీర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మకర రాశిఈ ఏడాది మకర రాశి వారికి చాలా బాగుంటుంది. ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యంతో ఈ ఏడాది నిండిపోతుంది. తీసుకున్న ప్రతీ నిర్ణయంలో విజయం సాధిస్తారు. కానీ కుటుంబంలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుంభ రాశిఈ రాశి వారికి అసలు ఈ ఏడాది మంచిగా లేదు. అనేక సమస్యలను వీరు ఎదుర్కొంటారు. ఎక్కువగా ధన నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాటలను అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే మీ మాటల వల్ల వాగ్వాదాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యాధుల బారిన పడవచ్చు. మీన రాశిమీన రాశి వారికి ఈ ఏడాది మిశ్రమంగానే ఉంది. కానీ వివాదాలకు కాస్త దూరంగా ఉండాలి. ఏ పని చేసిన రహస్యంగానే చేయండి. ఈ ఏడాది ఏ కొత్త పనులు ప్రారంభించిన విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కడుపునొప్పి, అలర్జీ, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో డబ్బు అధికంగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. Also Read : అందమైన పువ్వులతో ముగ్గులు.. కొత్త సంవత్సరానికి ఇంటిని అలకరించండిలా! గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు.