Health:బెల్లంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసా!

బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది.

New Update
jaggery

jaggery

 

బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది. అందుకే బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా యాసిడ్ వంటి సమస్యల దగ్గరికి రావు.

 బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా.. సరిగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుందిబెల్లంలో మంచి మొత్తంలో ఐరన్ లభిస్తుంది. బెల్లం ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.  రక్తహీనత వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది ముఖ్యంగా మహిళలు, పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో నిల్వ ఉన్న విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. 

ఇది కాలేయాన్ని డీటాక్స్ చేసి రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి..బెల్లంలో కాల్షియం, పొటాషియం వంటి మూలకాలు మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. వృద్ధులు ఖచ్చితంగా బెల్లం తినాలి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు బెల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే మంచి రిజల్టస్‌ ఉంటాయి. ఇందులో సహజ చక్కెర ఉంటుంది. 

ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. కానీ కొవ్వును పెంచదు. ఆహారం తిన్న తర్వాత బెల్లం ముక్క తినాలని నిపుణులు చెబుతున్నారు. బెల్లం టీ కూడా తయారు చేసుకుని తాగవచ్చు.

 health-tips | health tips in telugu | latest health tips | best-health-tips

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు