Hair Tips: కెమికల్ షాంపూలకు బైబై.. ఈ ఆకులతో జుట్టు ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల షాంపూలు ఉపయోగించక్కర్లేదు. మన పెరట్లో దొరికే మందార ఆకులను తలకు పెట్టడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Hair

Hair

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రకరకాల షాంపూలు ఉపయోగించక్కర్లేదు. మన పెరట్లో దొరికే మందార ఆకులను తలకు పెట్టడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కురులకు ఈ మందార ప్యాక్‌ను పెట్టుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అయితే ఒక నాలుగైదు మందార ఆకులను తీసుకుని అందులో మెంతులు పేస్ట్, కరివేపాకు, కలబంద వంటివి కలపాలి. వీటిని తలకు అప్లై చేసి ఒక రెండు లేదా మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. అయితే వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మందార ఆకులలో ఉండే మ్యూసిలేజ్ జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణను అందిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. మందార ఆకులను పేస్ట్‌లా చేసి తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు సమస్య వల్ల తలలో దురద, ఇబ్బంది కలుగుతాయి. మందార ఆకులలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

వారానికి ఒకసారి మందార ఆకుల పేస్ట్‌ను తలకు రాసుకుంటే చుండ్రు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మార్కెట్లో దొరికే రసాయన కండిషనర్ల కంటే మందార ఆకు చాలా ఉత్తమమైనది. దీనిని తలకు పట్టించినప్పుడు, ఇది జుట్టును మెత్తగా, పట్టులా మారుస్తుంది. జుట్టు చిక్కులు పడకుండా, స్మూత్‌గా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నేటి కాలంలో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం సాధారణమైపోయింది. మందార ఆకులను తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టుకు సహజమైన రంగు, మెరుపు లభిస్తుంది. ఇది జుట్టు అకాలంగా తెల్లబడకుండా కాపాడుతుంది.

ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస

Advertisment
తాజా కథనాలు