/rtv/media/media_files/2025/02/08/dycE8rB7HRFwz2KpVuSL.jpg)
angry
కోపం అనేది అందరికి ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. అయితే కొందరు మరీ ఎక్కువగా కోపానికి గురవుతుంటారు. అనుకున్నది జరగకపోయినా, నచ్చినది దొరక్కపోయినా కూడా ఆగ్రహానికి గురవుతారు. అయితే ప్రతీ చిన్న విషయానికి కూడా కోపానికి గురవుతుంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Mastan sai: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!
నిద్రలేమి వంటి సమస్యలు..
ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. వీటికి తోడు మానసికంగా ఆవేదన చెందుతారని నిపుణులు అంటున్నారు. కాబట్టి చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆగ్రహానికి గురి కావద్దు. ఏ విషయానికి అయినా కూడా కూల్‌గా సమస్యను పరిష్కరించకోండి. ఎప్పుడో ఒకసారి కోపానికి గురైతే ఒకే.. కానీ ప్రతీసారి కోపానికి గురైతే మాత్రం తలనొప్పి, జీర్ణ సమస్యలు, నిద్రలేమి, కడుపు నొప్పి, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
అలాగే యవ్వనం తగ్గిపోయి తొందరగా ముసలితనం వస్తుంది. కాబట్టి కోపానికి గురికావద్దు. ఒకవేళ కోపం వస్తే మాత్రం గ్లాసు చల్లని నీరు తాగండి. మీ కోపాన్ని తగ్గించే పనులు చేయండి. ఇలా చేయడం వల్ల కొంతవరకు మీ కోపం తగ్గుతుంది. వీటితో పాటు మెడిటేషన్, యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల కోపం తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.