కొందరికి ఉదయం లేచిన వెంటనే స్నానం చేసే అలవాటు ఉంటుంది. మరికొందరికి ఆలస్యంగా చేసే అలవాటు ఉంటుంది. దీంతో భోజనం అన్ని అయిన తర్వాత స్నానం చేస్తారు. కానీ తిన్న వెంటనే స్నానం చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు తిన్న వెంటనే స్నానం చేస్తే ఏమవుతుంది? ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? లేదా? అనే విషయం తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: You Tube: యూట్యూబ్ నుంచి 95లక్షల వీడియోలు, 45 లక్షల ఛానెళ్ళు తొలగింపు
తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణ సమస్యలు..
స్నానం చేసిన తర్వాతే భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు వస్తాయి. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవయవాలు పనిచేస్తాయి. తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఇది కూడా చూడండి: AP News: మగవారికంటే మహిళలే మెరుగ్గా రానిస్తున్నారు.. చంద్రబాబు సంచలన కామెంట్స్!
ఇది జీర్ణ అవయవాలకు రక్త ప్రవాహాన్ని రెట్టింపు చేస్తుంది. దీంతో జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగి ఆటంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తిన్న వెంటనే స్నానం చేయవద్దు. ఒక గంట ఆగిన తర్వాత స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. లేకపోతే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తిన్న వెంటనే స్నానం చేయవద్దు.
ఇది కూడా చూడండి: HYD NEWS: ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ ఎమ్మెల్యే తీగల మనువడు దుర్మరణం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్‌లీ!