ఉదయాన్నే వెల్లుల్లి తింటే.. అనారోగ్య సమస్యలన్నీ పరార్

వెల్లుల్లిని ఉదయాన్నే తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. వెల్లుల్లిలోని ఆల్లిసిన్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

New Update
garlic Vs bad cholesterol

garlic

వెల్లులి ప్రపంచవ్యాప్తంగా వంటగదిలో ముఖ్యమైన పదార్థంగా ఉపయోగిస్తారు. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మరి చూద్దాం. 

ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

మానసిక ఆరోగ్యం.. 

వెల్లులి అన్ని వ్యాధులను నయం చేయగలదనే అపోమాహ చాలా ఎక్కువగానే ఉంది. నిజానికి, వెల్లులిలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండటం వల్ల ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అయితే, ఇది ఏ వ్యాధికైనా పూర్తి స్థాయి చికిత్సగా ఉపయోగించకూడదు. శాస్త్రీయ పరిశోధనల పరంగా, వెల్లులి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయక పాత్ర పోషించినా డాక్టర్ సూచించిన చికిత్సలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించకూడదు.

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

కొంతమంది పచ్చి వెల్లులి ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. పచ్చి వెల్లులిలో ఎక్కువ ఆల్లిసిన్ ఉంటుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలకు కారణమవుతుంది. అయితే, వండిన వెల్లులిలో కొన్ని పోషకాల విలువలు కాస్త తగ్గిపోవచ్చు కానీ, కొన్ని పోషకాలు మాత్రం సులభంగా శరీరానికి అందేలా చేస్తుంది. కాబట్టి, వండిన వెల్లులిలోనూ ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించాలి.

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

కొంతమంది వెల్లులి మాత్రలు లేదా పొడి కూడా పచ్చి వెల్లులితో సమానంగా ప్రయోజనాలను అందిస్తాయని నమ్ముతారు. పచ్చి వెల్లులిలో అనేక సహజసిద్ధమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల, మోతాదును దాటకుండా సరైన మోతాదులో పచ్చి వెల్లులి తీసుకోవడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు