/rtv/media/media_files/2025/02/28/2THaEoPan2weOZvmrcfT.jpg)
Healthy Life Photograph: (Healthy Life)
మునగకాయల్లో వెయ్యి రోగాలను నయం చేసే శక్తి ఉంటుంది. ఇందులో ఖనిజాలు, థెరపిటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వేసవిలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలన్ని కూడా తగ్గుతాయి. మునగకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫ్రీ రాడికల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. తొందరగా ముసలితనం రాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ముఖంపై ఉండే ముడతలను తగ్గిస్తాయి.
ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!
జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి..
వీటిలోని ఐరన్, విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. డైలీ వీటిని తీసుకుంటే జట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. మునగకాయలనే కాదు.. ఆకులను తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే. మునగకాయలను తినడం వల్ల నిద్రలేమి సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి.
ఇది కూడా చూడండి: హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..!
ముఖ్యంగా మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతున్న వారికి మునగకాయలు బాగా ఉపయోగపడతాయి. మునగాకాయలు ఆరోగ్యానికి మంచివే. అలా అని ఎక్కువగా వీటిని తీసుకోకూడదు. తక్కువ మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఎక్కువగా వీటిని తీసుకుంటే బాడీకి వేడి చేస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకోండి.
ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.