/rtv/media/media_files/2025/02/07/hE71l0gJxbxu9AAr0sxn.jpg)
eggs
గుడ్లు ఆరోగ్యానికి మంచివే. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా తయారు అవుతాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. జిమ్ చేసేవాళ్లు ఎక్కువగా గుడ్లు తింటుంటారు. ఇందులోని ప్రొటీన్ కండరాలను బలంగా చేస్తుంది. నీరసం, అలసట వంటివి లేకుండా ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. అయితే కొందరు ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటారు. కానీ రోజులో కేవలం రెండు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే ఉడికించి తింటే..
రెండు గుడ్లులో 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. శరీరానికి ప్రొటీన్ అవసరమే. అది మితంగా మాత్రమే ఉండాలి. రోజులో రెండుకి మించి ఎక్కువ గుడ్లు తీంటే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉడికించిన గుడ్లును ఉదయం తినడం ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
వీటిలో విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇతోపాటు సెలీనియం, జింక్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే హార్మోన్ల పనితీరును సమతుల్యం చేయడంతో పాటు శరీర బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. గుడ్లలో ఆస్టియోజెనిక్ బయోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!