/rtv/media/media_files/2024/11/23/watchingmobile81.jpeg)
watching mobile
ఈ రోజుల్లో తల్లిదండ్రులు బిజీ అయిపోయి పిల్లలకు ఎక్కువగా మొబైల్స్ ఇస్తున్నారు. పిల్లలు తినకపోయినా, ఏడ్చినా, ఏదైనా మారం చేస్తే చాలు వెంటనే మొబైల్ ఇచ్చేస్తుంటారు. పిల్లలు ఎక్కువగా మొబైల్స్ చూడటానికే అలవాటు పడుతున్నారు. ఎక్కువగా ఈ రేస్ చూడటం వల్ల పిల్లల కళ్లకు దెబ్బ పడుతుంది. కంటిలోని రెటినా బాగా దెబ్బతింటుంది. దీంతో వారు రంగులను గుర్తించలేరు. చిన్న తనంలోనే వారికి కలర్ బ్లైండ్‌నెస్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: High Heels: హైహీల్స్ వేసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవా?
ఎక్కువగా పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా..
చిన్నపిల్లలు అనేవారు ఏడాది తర్వాత మాటలు ఆడటం మొదలు పెడతారు. ఇలాంటి సమయాల్లో వారు ఎక్కువగా మొబైల్ చూసుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడలేరు. వారికి రెండు మూడేళ్ల వరకు మాటలు రావు. పూర్తిగా ఎవరితో మాట్లాడటం అలవాటు చేసుకోకుండా మొబైల్ చూస్తూ ఉంటే దీనికే అలవాటు పడతారు. పెద్ద అయిన తర్వాత కూడా మాటలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా పిల్లలకు అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకూడదని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Drinking Water: నీరు ఎక్కువగా తాగడం కూడా ప్రమాదమేనా..రోజుకు ఎన్నిగ్లాసులు తాగాలి?
పిల్లలు ఏడాది తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈ సమయంలో వారిని ఒంటరిగా వదలకుండా ఇతరులతో మాట్లాడటం అలవాటు చేయాలి. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలా కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా చేయాలి. దీనివల్ల వారికి తొందరగా మాటలు వస్తాయి. పూర్వకాలంలో స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులతో ఉంచి మాట్లాడించేవారు. వారికి ఒక్కో మాట నేర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. అలాగే తొందరగా మాటలు వస్తాయి. అదే చిన్నతనంలో వారు ఎక్కువగా మొబైల్స్ చూస్తుంటే మాత్రం పెద్దయ్యాక వారికి ఆటిజం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Gold and Sliver Prices: దిగ..దిగనంటోన్న బంగారం.. మార్కెట్ ఎలా ఉందంటే..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Telangana: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం