Astrology: నేటి నుంచి ఆ రాశుల వారికి తిరుగుండదు.. పట్టిందల్లా బంగారమే..!

ఫిబ్రవరి నెలలో అనేక గ్రహాలు, నక్షత్రరాశుల స్థానాలు మారబోతున్నాయి. ఈ క్రమంలో బుధుడు, శని కలయిక ద్వాదశ యోగాన్ని ఏర్పరుస్తుంది . అయితే ద్వాదశ యోగం కుంభ, మీనా, వృషభ రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

New Update
zodiac sign

zodiac sign

Astrology:  ఫిబ్రవరి నెలలో, అనేక గ్రహాలు,  నక్షత్రరాశుల స్థానం మారబోతున్నాయి. అయితే తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైన శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిచక్రాన్ని మారుస్తుంది. దీని కారణంగా అది మరొక గ్రహంతో సంయోగాన్ని ఏర్పర్చనుంది. ఈ  క్రమంలో శని గ్రహం బుధుడికి దగ్గరగా చేరుకోవడం ద్వారా ద్వాదశ యోగం ఏర్పడుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, రెండు గ్రహాలు జాతకంలో రెండు,  పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ద్విదశ యోగంగా పరిగణించబడుతుంది. ఈ రెండింటి కలయిక ద్వారా ఏర్పడిన ద్విదశ యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని, సుఖశాంతులను కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..  

కుంభ రాశి

కుంభ రాశి వారికి కూడా ద్విదశ రాజయోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రంగంలోనూ గొప్ప విజయాలను సాధిస్తారు. సమాజంలో, పని కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. పదవితో పాటు జీతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

వృషభ రాశి

ఈ రాశివారికి శని పదవ ఇంట్లో,  బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంచబడతాడు. అటువంటి పరిస్థితిలో, ద్విదశ యోగం ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభాలతో పాటు, ఆస్తి, ఇంటి విషయంలో ఆనందం కలుగుతుంది. పెట్టుబడుల్లో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో వృషభ రాశివారు ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. 

మీన రాశి 

ద్విదశ రాజయోగం  మీన రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. భౌతిక ఆనందాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం, ప్రజాదరణ పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా ద్విదశ రాజయోగం ప్రయోజనకరంగా సూచిస్తోంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

Advertisment
Advertisment
Advertisment